తుక్కుగూడ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సాయం చేయడానికి వెళ్లిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్‌రోడ్‌పై చోటు చేసుకుంది.
ఔటర్ రోడ్ ఎగ్జిట్ 14 వద్ద ఓ మతి స్థిమితం లేని వ్వక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి అతడికి సహాయం అందించడానికి కారు ఆపి వెళ్లగా.. శంషాబాద్ వైపు నుంచి వస్తున్న మరో కారు శ్రీకాంత్ రెడ్డిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు. కారు నంబర్ ఆధారంగా శ్రీకాంత్ రెడ్డి కీసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
సాయం చేద్దామని వెళ్లి..
Published Tue, May 16 2017 10:41 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement