రోడ్డు ప్రమాదాల నివారణకు సర్వే
రోడ్డు ప్రమాదాల నివారణకు సర్వే
Published Mon, Mar 13 2017 11:34 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఈ నెల 20న ఉన్నతాధికారులకు నివేదిక
రావులపాలెం : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టేందుకు రావులపాలెంలో సోమవారం అధికారుల బృందం సర్వే చేసింది. కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ, ఎంవీఐ ఎం.హరినాథరెడ్డి, ఎన్‌హెచ్ టీమ్ లీడర్ డి.యోలే, హైవే ఇంజినీరు సురేంద్ర, కాంట్రాక్టర్ దుర్గేష్ ఈ సర్వేను రావులపాలెం నుంచి గోపాలపురం వరకూ హైవేపై సర్వే చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాలకు కారణాలను విశ్లేషించారు. తీసుకోవాల్సిన చర్యలను నమోదు చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద నేపథ్యంలో డీజీపీ, ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కమిటీని నియమించినట్టు చెప్పారు. జిల్లాలో ఉన్న 216, 16 హైవేలపై సర్వే చేస్తామన్నారు. జిల్లాలోని 12 స్టేట్ హైవేపై సర్వేను చేసేంచేందుకు డీఎస్పీ విద్యారావు నేతృత్వంలో మరో కమిటీ ఏర్పాటైందన్నారు. జిల్లాలో గతేడాది జరిగిన 1,869 రోడ్డు ప్రమాదాలో 671 మంది మృతి చెందగా 2,069 మంది గాయపడ్డారన్నారు. తీసుకోవాల్సిన చర్యలతో సర్వే నివేదికను ఈ నెల 20లోగా ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ వద్ద రోడ్డు నిర్మాణంలో లోపాలు ఉన్నందున అండర్‌పాస్ నిర్మించాల్సి ఉందన్నారు. జొన్నాడ, మడికి, మల్లాయి దొడ్డి, ఈతకోట, గోపాలపురం చెక్‌పోస్టు సెంటర్ ప్రాంతాలను బ్లాక్ స్పాట్ ప్రాంతాలు గుర్తించామన్నారు.
Advertisement
Advertisement