కరీంనగర్ మండలం బొమ్మకల్ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందాడు.
22కెఎన్‌టీ102 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యూసుఫ్
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ మండలం బొమ్మకల్ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందాడు. రేకుర్తి సాలేనగర్‌కు చెందిన ఎండీ యూసుఫ్(48) ఆర్టీసీ వర్క్‌షాప్‌లో వెల్డర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం ఉదయం గోదావరిఖనిలోని ఓ వివాహానికి హాజరై తిరిగి తన కారులో కరీంనగర్ బయలుదేరారు.
బొమ్మకల్ శివారులో మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యూసుఫ్ అక్కడికక్కడే మృతిచెందగా, కారులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ శశిధర్‌రెడ్డి తెలిపారు.
పలు సంఘాల్లో కీలకనేత
యూసుఫ్ కార్మిక సంఘం నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎన్‌ఎంయూలో గ్యారేజ్ కార్యదర్శిగా పనిచేశారు. టీఎంయూ ఆవిర్భావ సమయంలో పనిచేశారు. నాయకత్వంతో విభేదాలు రావడంతో ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు. ప్రస్తుతం ఆ యూనియన్‌లో రీజియన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.