rtc employee
-
ఓటు కోసం నిరాహార దీక్ష
గల్లంతైన ఓటు కోసం ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి నిరాహార దీక్ష చేపట్టిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో పనిచేసే ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్లో తన పేరు లేకపోవడంతో బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు.కేఎస్ఆర్టీసీకి చెందిన కెంగేరి డివిజన్లో అసిస్టెంట్ స్టోర్‌కీపర్‌గా పనిచేసే మల్లికార్జున్ స్వామి బుధవారం బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని జేఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వెళ్లాడు. కానీ ఆయన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగాడు.సంబంధిత అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టినట్లు మల్లికార్జున్ తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణ బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గంలోని బొమ్మనహళ్లి పోలింగ్ స్టేషన్లో మల్లికార్జున్‌ను అసిస్టెంట్ పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించారు.ఎన్నికల విధులకు కేటాయించిన మరికొంత ఉద్యోగుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో కూడా ఓటు హక్కును వినియోగించుకోలేని వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆయన మండిపడ్డారు.మల్లికార్జున్ వాస్తవానికి చామరాజనగర్ జిల్లాలోని సోమనాథపుర గ్రామానికి చెందినవాడైనా ఇక్కడ ఓటర్ల జాబితాలో ఆయన పేరు నమోదైంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు రెండో దశలో శుక్రవారం పోలింగ్ జరుగతోంది. -
నేడు గవర్నర్‌తో ఆర్టీసీ జేఏసీ భేటీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లుపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో మంగళవారం ఉదయం 8 గంటలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భేటీ కానుంది. కొద్దిరోజుల క్రితమే సచివాలయం నుంచి బిల్లు రాజ్‌భవన్‌కు చేరిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవలే గవర్నర్ ప్రకటించారు. అసెంబ్లీ ఆమోదం పొంది నెలపైనే గడిచినందున వీలైనంత తొందరలో బిల్లు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదించి పంపాలని జేఏసీ కోరనుందని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. దీంతోపాటు ప్రభుత్వంలో విలీనం కంటే ముందే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆర్థిక అంశాలను ప్రభుత్వం పరిష్కరించేలా చూడాలని కూడా వారు కోరనున్నట్టు తెలిసింది. రెండు వేతన సవరణలుసహా మొత్తం 30 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని గవర్నర్‌కు సమర్పించనున్నారు. -
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో అత్యధిక పెన్షన్ విధానం
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో అత్యధిక పెన్షన్ విధానం (హైయ్యెస్ట్ పెన్షన్ సిస్టమ్) అమలు కానుందని, అందుకు ఆర్టీసీ కార్మికులు అర్హులయ్యారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యధిక పెన్షన్ కోసం పీఎఫ్ ఫండ్ ట్రస్ట్‌కు తెలంగాణతో సహా వేరే రాష్ట్రాల సంస్థలు దరఖాస్తు చేసినా, కేవలం మన ఆర్టీసీకే ఆ అవకాశం వచ్చిందని.. అందుకు ప్రధాన కారణం సీఎం జగన్మోహన్రెడ్డి చొరవ చూపడమేనని తెలిపారు. 50 వేలకు పైగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనం కాగా, వారితో పాటు.. 2014 తర్వాత రిటైర్ అయిన దాదాపు 10,200 మంది ఉద్యోగులు, కార్మికులు అత్యధిక పెన్షన్ విధానంలో ప్రయోజనం పొందుతారని చెప్పారు. దీనిపై ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ‘ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల వరకు పెన్షన్ రానుంది. గతంలో వారికి కేవలం రూ. 3 వేల నుంచి రూ. 4 వేల పెన్షన్ మాత్రమే వచ్చేది. అదే ఇవాళ వారికి గౌరవప్రదమైన పెన్షన్ వస్తుందని.. దీంతో ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని’ మంత్రి అన్నారు. ప్రభుత్వ వేతనాలు: ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ కార్మికులకు దాదాపు రూ. 10,570 కోట్ల జీతాలు చెల్లించిందన్నారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ మూలధనాన్ని ముట్టుకోక పోవడం వల్ల.. సంస్థ మనుగడ కొనసాగిస్తోందని పేర్కొన్నారు. వీటితో పాటు రుణాలు కూడా తీరుస్తోందన్నారు. సీఎంజగన్ నిర్ణయం, ఆయన చూపిన చొరవ వల్ల, సంస్థ అప్పుల నుంచి బయట పడడమే కాకుండా, ఉద్యోగులు, కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందన్నారు. నాలుగేళ్లలో సంస్థ పురోగతి: ‘నాలుగేళ్లలో ఆర్టీసీ ఎంతో పురోగతి సాధించింది. పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాం. వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ అమలు చేస్తున్నాం. ఇంకా జనవరి 1, 2016 నుంచి డిసెంబరు 31, 2019 వరకు దాదాపు 858 మందికి కారుణ్య నియామకాల కింద వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఈహెచ్ఎస్ కార్డు వారికీ ఇచ్చాం. కొత్తగా 1500 డీజిల్ బస్సులు, 1000 విద్యుత్ బస్సులు కొంటున్నాం. ప్రతి ఉద్యోగికి రూ. 40 లక్షల ప్రమాద బీమా, రూ. 5 లక్షల సహజ మరణ బీమా సదుపాయం కల్పిస్తున్నాం. ఇప్పటికే 390 కుటుంబాలకు ఆ బీమా ద్వారా లబ్ధి చేకూరిందని’ చెప్పారు. చదవండి: ఎగిరి గంతేసిన టీడీపీ.. తీరా చూస్తే.. అసలు గుట్టు తెలిసిందిలే.. -
లోకేష్‌కు కలిసిరాని కొత్త ప్లాన్.. చట్టపరంగా చర్యలకు దిగిన ఏపీఎస్ఆర్టీసీ!
సాక్షి, విజయవాడ: టీడీపీ తప్పుడు ప్రచారాలకు కేరాఫ్ మారింది. ఉన్నది లేన్నట్టుగా.. జరగనిది జరిగినట్టుగా చూపిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది. తాజాగా మరో తప్పుడు వార్తను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై అక్కస్సు వెళ్లగక్కింది. కానీ, తీరా అది ఫేక్ అని తేలడంతో టీడీపీని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అటు, ఏపీఎస్ఆర్టీసీ కూడా టీడీపీ తప్పుడు ప్రచారంపై స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నారా లోకేష్‌ను కలిసిన ఓ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారని టీడీపీ, లోకేష్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఓ పోస్టును పెట్టి వైరల్ చేశారు. అయితే, ఈ పోస్టుపై ఏపీఎస్ఆర్టీసీ యాజ్యమాన్యం స్పందించింది. తాము ఆ డ్రైవర్‌ను తొలగించలేదని స్పష్టం చేసింది. ఇది అస్యత ప్రచారం అని ఖండించింది. ఇలాంటి తప్పుడు ప్రచారానికి బాధ్యులైన టీడీపీ సోషల్ మీడియా నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇక, టీడీపీ పోస్టు చేసిన వార్త ఫేక్ అని తేలడంతో నారా లోకేష్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. #FakeNewsAlert This is absolutely false News. We strongly deny these claims made in media. APSRTC will initiate suitable legal action on the responsible social media administrators for such fake propaganda https://t.co/g5HveEE2R0 — APSRTC (@apsrtc) February 8, 2023 -
నేడు వాయుగుండం
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం/ శ్రీకాళహస్తి రూరల్: ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం నాటికి అల్పపీడనం బలపడి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. తదుపరి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తరాంధ్రలో ఈ నెల 12న తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో కోస్తా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుందనీ, తీరం వెంబడి గంటకు 45 నుంచి గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. 3 రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగుపాటుకు ఆర్టీసీ ఉద్యోగి మృతి పిడుగుపాటుకు ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో చోటుచేసుకుంది. కొత్తపాళెంమిట్ట గ్రామానికి చెందిన టి.సుబ్రహ్మణ్యం (35) శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో మెకానిక్ పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తికి వచ్చిన ఆయన భార్యతో కలసి ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలు దేరారు. మార్గం మధ్యలో అమ్మపాళెం సమీపంలోకి రాగానే భారీగా వర్షం పడుతుండటంతో ఓ చెట్టుకింద ఆగారు. అదే సమయంలో పిడుగు పడటంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందారు. భార్య గౌరి స్పల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అదేవిధంగా పెద్దపంజాణి మండలంలోనూ పిడుగుపాటుకు ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. -
జీతాలు ఇచ్చేదెట్లా?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వచ్చేనెల ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చిలో బ్యాంకు నుంచి తెచ్చిన రూ.600 కోట్ల అప్పు నుంచి ఇంతకాలం ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూ వచ్చారు. గత నెలతో ఆ డబ్బులు పూర్తిగా ఖర్చయ్యాయి. వచ్చే నెల జీతాలకు డబ్బుల్లేవు. మూడు రోజుల కిందట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. జీతాలకు డబ్బు సర్దుబాటు చేయాల్సిందిగా ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ ఆర్థిక శాఖ అధికారులను కోరారు. ఇందుకు వారు నిరాకరించారు. తమ వద్ద ప్రస్తుతానికి అంత వెసులుబాటు లేదని, డబ్బు కావాలంటే సీఎంతోనే మాట్లాడుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాలపై దృష్టి సారించాలని, ఇలా ప్రతినెలా ఆర్థిక శాఖను డబ్బు అడగటం సరికాదని పేర్కొన్నట్టు తెలిసింది. దీంతో ఎండీ సునీల్‌శర్మ అధికారులతో సమావేశమై ఆదాయాన్ని పెంచే మార్గాలపై చర్చించారు. మరోవైపు కేంద్రం బ్యాంకు అప్పులపై విధించిన మారటోరియం గడువు పూర్తి కావటంతో బ్యాంకులకు పెద్ద మొత్తంలో ఆర్టీసీ డబ్బులు చెల్లించాల్సి ఉంది. అవి చెల్లించని పక్షంలో నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ (ఎన్పీఏ)గా ఆర్టీసీకి రిమార్క్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. మరోవైపు మూడు నెలలుగా బిల్లుల కోసం తిరుగుతున్న అద్దె బస్సు యజమానులు మూడు రోజుల క్రితం బస్‌భవన్‌ను ముట్టడించారు. డబ్బులు చెల్లిం చని పక్షంలో వారు న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆర్టీసీ సహకార పొదుపు సంఘం (సీసీఎస్) సంస్థ వాడుకున్న తమ డబ్బు కోసం హైకోర్టులో కోర్టు ధిక్కార కేసు దాఖలు చేసింది. వచ్చేనెల 5న కోర్టుకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగటంతో ఆర్టీసీకి దిక్కుతోచడం లేదు. శివారు గ్రామాలకు బస్సులు చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్న ఆర్టీసీ రోజువారీ ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో నగరానికి సమీపంలో ఉన్న ఊళ్లకు తిప్పే బస్సులను బుధవారం తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సిటీ బస్సులకు అనుమతి లేకపోవటంతో జిల్లా సర్వీసులను తిప్పుతున్న సంగతి తెలిసిందే. నగరానికి చేరువగా ఉన్న గ్రామాలకు సిటీ డిపోల నుంచి తిరిగే బస్సులను కూడా జిల్లా సర్వీసులుగానే పరిగణిస్తూ బుధవారం ఉదయం నుంచి తిప్పటం ప్రారంభించారు. నగరంలోని 18డిపోల నుంచి 230 సర్వీసులు ప్రారంభించారు. నగరానికి 50 నుంచి 60 కి.మీ. పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు ఇవి తిరుగుతాయి. సిటీలో తిరగవు. వీటి రూపంలో రోజుకు రూ.25 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం జిల్లా సర్వీసుల ద్వారా వస్తున్న రూ.4 కోట్ల రోజువారీ ఆదాయానికి ఇది తోడై కొంత ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక సిటీ బస్సులు నడపాలా వద్దా అన్న నిర్ణయం ముఖ్యమంత్రి పరిధిలో ఉంది. ఆయన ఆదేశం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. -
విధులకు 7 నెలల గర్భిణి
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని డిపోకు చెందిన ఏడు నెలల గర్భిణి అయిన కండక్టర్ సుమలత శుక్రవారం విధులకు హాజరయ్యారు. 55 రోజుల సమ్మె, సెప్టెంబరు నెల వేతనం లేకపోవడం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో తాను విధులకు హాజరైనట్లు సుమలత తెలిపారు. కాగా, మంథనికి చెందిన స్థానికుడు మారుపాక సత్యనారాయణ.. సుమలతకు రూ.5 వేల నగదు, పండ్లు, బట్టలు అందించారు -
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, తొర్రూరు(వరంగల్) : ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య ఘటన మరువకముందే తొర్రూరు మండలంలోని సోమారంలో గురువారం ఓ కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని సోమారం గ్రామానికి చెందిన మేకల లక్ష్మీనారాయణ అనే ఆర్టీసీ డ్రైవర్ 2004 సంవత్సరంలో అనారోగ్యంతో విధుల్లో ఉండి మృతి చెందాడు. ఈక్రమంలో వారసత్వంగా గత రెండేళ్ల క్రితం తొర్రూరు ఆర్టీసీ డిపోలో తన కుమారుడు మేకల అశోక్ (30) శ్రామిక్‌గా విధుల్లో చేరాడు. ఇప్పటికే చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నక్రమంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. కార్మికుల సమస్యల పరిష్కరం పట్ల ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడం, విధులు లేక, రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, అసలు తమ సమస్యలు పరిష్కరం అవుతాయో లేదేమోనాని ఆందోళన చెందిన అశోక్ మనస్థాపంతో ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి, తన కుటుంబానికి సన్నిహితుడైన ఓ వ్యక్తికి ఫోన్ చేసి తెలియజేశాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు అశోక్ ఇంటి వద్దకు వెళ్లి చూసి, వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో తొర్రూరులోని సాయిమల్టీ స్పెషలిటీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అశోక్‌కు భార్య స్రవంతి, కుమారుడు లక్ష్మిపతి, కుమారై లక్ష్మిప్రసన్న ఉన్నారు. అధికారుల పరామర్శ.. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు మేకల అశోక్‌ను తొర్రూరు ఆర్డీఓ ఈశ్వరయ్య, డీఎస్పీ మదన్‌లాల్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరాం,, డిప్యూటి డీఎంహెచ్ఓ డాక్టర్ కోటచలం, తహసీల్దార్ రమేష్‌బాబు, సీఐ చేరాలు, ఎస్సై నాగేష్, ఆర్ఐ భాస్కర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, సర్పంచ్‌లు సంపత్, రవీందర్‌రెడ్డి, వామ పక్ష పార్టీల నాయకులు వెంకటయ్య, కొత్తపెల్లి రవి, బొల్లం అశోక్, ముంజంపెల్లి వీరన్న, తమ్మెర విశేశ్వర్‌రావు, గట్టు శ్రీమన్నారాయణ, ఆర్టీసీ నాయకులు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. -
ఆర్టీసీ అధికారి ఇళ్లల్లో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం రూరల్/కాశీబుగ్గ/మందస/వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం, విజయనగరం ఆర్టీసీ రీజియన్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌గా పనిచేస్తున్న బమ్మిడి రవికుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఆయన ఉంటున్న ఇల్లుతో పాలు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో 7 చోట్ల సోమవారం ఏక కాలంలో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. విలువైన డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర తెలిపిన వివరాలు ఇలావున్నాయి. శ్రీకాకుళం నగరంలోని గోవిందనగర్‌కు చెందిన బమ్మిడి రవికుమార్ 1987లో ఆర్టీసీలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధుల్లోకి చేరారు. వైజాగ్, విజయనగరం తదితర ప్రాంతాల్లో అప్పట్లో పనిచేశారు. 2010లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పదోన్నతి పొంది శ్రీకాకుళంలోనే పనిచేస్తున్నారు. గడచిన మూడు నెలలుగా శ్రీకాకుళం, విజయనగరం రీజియన్‌కు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడగట్టారన్న సమాచారంతో ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర పర్యవేక్షణలో ఏసీబీ అధికారులు ఆయన నివాసం ఉంటున్న ఇల్లుతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని గోవిందనగర్తో పాటు పలాస, పూండి, మందస ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఏక కాలంలో సోదాలు జరిపారు. రవికుమార్ బావమరిది అమరసింహుడు ఆర్టీసీలో ఛీప్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఈయన ఇంట్లో కూడా తనిఖీలు చేయగా వీరిద్దరూ కలిసి ఇదివరకూ చేసిన ట్రాంజేషన్స్ పత్రాలను గుర్తించారు. అలాగే శ్రీకాకుళం నగరంలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న రవికుమార్ మేనల్లుడు దువ్వాడ రామారావు ఇంట్లో తనిఖీలు చేయగా విలువైన డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు, ఇతరత్రవి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే నగరంలోని న్యూకాలనీలో కట్టించిన 20 ప్లాటులకు సంబంధించిన పత్రాలు కూడా గుర్తించారు. అదేవిధంగా పలాస ఆర్టీసీ డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న రవికుమార్ స్నేహితుడు శివకుమార్ ఇంట్లో(పలాస), మందసలో నివాసం ఉంటున్న రవికుమార్ మరో బావమరిది వాయిపల్లి రామారావు ఇంట్లో, రవికుమార్ బార్య ధనలక్ష్మీ అన్నయ్య చాపర కోదండరాం ఇంట్లో తనిఖీలు చేశారు. అలాగే వజ్రపుకొత్తూరు మండలంలోని పూండిలో శ్రీవెంకటేశ్వర నర్సింగ్ హోమ్, సాయివినీత్ విద్యా సంస్థల్లో దాడులు జరిగాయి. బమ్మిడి రవికుమార్‌కు వెంకటేశ్వర నర్సింగ్ హోమ్‌కు చెందిన డాక్టర్ సీహెచ్ కోదండరావు, డాక్టర్ కె.లీల బంధువులు కావడంలో ఇక్కడ దాడులు చేపట్టారు. ఏక కాలంలో సోదాలు చేయగా జాయింట్ అకౌంట్స్‌తో కలిసి విరివిరిగా విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు వివరించారు. మూడు కోట్ల ఆస్తులు గుర్తింపు బమ్మిడి రవికుమార్‌తో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లల్లో ఆయా ప్రాంతాల్లో ఏడు చోట్ల జరిగిన సోదాల్లో ప్రస్తుతం రూ.3 కోట్లు ఆస్తులు గుర్తించినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. దొరికిన డాక్యుమెంట్లును పూర్తిస్థాయిలో ఇంకా లెక్కించాల్సి ఉందన్నారు. అయితే శ్రీకాకుళం పరిధిలో మాత్రం రూ.2 లక్షలు నగదు, కేజీ బంగారం, బ్యాంకుల్లో రూ.15 లక్షలు, ఇతరత్రా బిల్డింగ్లు, రియల్ఎస్టేట్ డాక్యుమెంట్ పత్రాలు వారి కుటుంబ సభ్యుల పేర్లుమీద ఉన్నవాటిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు ఏసీబీ అధికారుల ఆధీనంలో ఉన్నాడని మంగళవారం అరెస్టు చూపిస్తామని తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు చెందిన 20 మంది అధికారులు పాల్గొన్నారని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి
22కెఎన్‌టీ102 రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యూసుఫ్ కరీంనగర్‌క్రైం: కరీంనగర్ మండలం బొమ్మకల్ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందాడు. రేకుర్తి సాలేనగర్‌కు చెందిన ఎండీ యూసుఫ్(48) ఆర్టీసీ వర్క్‌షాప్‌లో వెల్డర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం ఉదయం గోదావరిఖనిలోని ఓ వివాహానికి హాజరై తిరిగి తన కారులో కరీంనగర్ బయలుదేరారు. బొమ్మకల్ శివారులో మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యూసుఫ్ అక్కడికక్కడే మృతిచెందగా, కారులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఇన్స్పెక్టర్ శశిధర్‌రెడ్డి తెలిపారు. పలు సంఘాల్లో కీలకనేత యూసుఫ్ కార్మిక సంఘం నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎన్‌ఎంయూలో గ్యారేజ్ కార్యదర్శిగా పనిచేశారు. టీఎంయూ ఆవిర్భావ సమయంలో పనిచేశారు. నాయకత్వంతో విభేదాలు రావడంతో ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు. ప్రస్తుతం ఆ యూనియన్‌లో రీజియన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ మండలం బొమ్మకల్ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందాడు. రేకుర్తి సాలేనగర్‌కు చెందిన ఎండీ యూసుఫ్(48) ఆర్టీసీ వర్క్‌షాప్‌లో వెల్డర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శనివారం ఉదయం గోదావరిఖనిలోని ఓ వివాహానికి హాజరై తిరిగి తన కారులో కరీంనగర్ బయలుదేరారు. బొమ్మకల్ శివారులో మూలమలుపు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో యూసుఫ్ అక్కడికక్కడే మృతిచెందగా, కారులో ప్రయాణిస్తున్న మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఇన్స్పెక్టర్ శశిధర్‌రెడ్డి తెలిపారు. పలు సంఘాల్లో కీలకనేత యూసుఫ్ కార్మిక సంఘం నాయకుడిగా కొనసాగుతున్నారు. ఎన్‌ఎంయూలో గ్యారేజ్ కార్యదర్శిగా పనిచేశారు. టీఎంయూ ఆవిర్భావ సమయంలో పనిచేశారు. నాయకత్వంతో విభేదాలు రావడంతో ఎంప్లాయీస్ యూనియన్‌లో చేరారు. ప్రస్తుతం ఆ యూనియన్‌లో రీజియన్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. -
కుప్పం ఎన్టీఆర్నగర్లో విషాదం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కుప్పం ఎన్టీఆర్నగర్లో బుధవారం ఓ విషాదం చోటుచేసుకుంది. కుటుంబకలహాలతో ఆర్టీసీ ఉద్యోగి సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే భర్త మరణాన్నితట్టుకోలేని భార్య కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. భార్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్టీసీ కార్మికుడు అనుమానాస్పద మృతి
నందికొట్కూరు : కర్నూలు జిల్లాలో ఓ ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున నందికోట్కూరు ఆర్టీసీ డిపోలో జరిగింది. వివరాలు.. కర్నూలుకు చెందిన చైతన్యకుమార్(24) ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా డిపోలోని గ్యారేజీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యాడు. కాగా, సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు వరకు పని చేసిన అనంతరం గ్యారేజ్ లోనే నిద్రపోయాడు. అయితే తెల్లవారే సరికి అతను మృతి చెందాడు. సోమవారం ఉదయం డిపోకు వచ్చిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చైతన్యకుమార్ గుండెపోటుతో కానీ, ఏదైనా విషపు పురుగు కరవడంతోనే చనిపోయి ఉంటాడా అనే పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నాన్న ప్రాణం నిలబెట్టండి
అధిక బరువు, వ్యాధులతో బాధపడుతున్న ఆర్టీసీ ఉద్యోగి లింగమయ్య పిల్లల విజ్ఞప్తి కనీసం లేచి నడవలేని దుస్థితి.. ఆదుకోవాలంటూ వేడుకోలు విజయవాడ: రోజు రోజుకూ మరింతగా బరువు పెరిగిపోయే వ్యాధి ఒకవైపు, శరీరం నిండా మానని గాయాలు మరోవైపు.. నడవలేడు, నిలబడలేడు, సరిగా పడుకోలేడు కూడా. మెదక్ జిల్లా జహీరాబాద్‌కు చెందిన 53 ఏళ్ల లింగమయ్య అవస్థ ఇది. ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న ఆయన కొన్నేళ్లుగా బరువు పెరుగుతూ.. ఇప్పుడు ఏకంగా 202 కేజీలకు పెరిగిపోయారు. 2009లో ఆయనకు గుండెపోటు రాగా స్టెంట్ అమర్చారు. దానికితోడు మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ వ్యాధుల నుంచి బయటపడడానికి నిమ్స్‌కు వెళ్లినా, పలు కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. ఫలితం లేదు. ఇలాగే అధిక బరువుతో బాధపడి బేరియాట్రిక్ సర్జరీతో ఉపశమనం పొందిన ఒక స్నేహితుడి సహాయంతో లింగమయ్య విజయవాడలోని ఎండోకేర్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ లింగమయ్యను పరీక్షించిన వైద్యులు.. శరీరంలో గాయాలు తగ్గిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం గాయాలు మానడానికి కొద్దిరోజుల పాటు రోజుకు రూ. 10 వేల విలువైన యాంటీ బయాటిక్స్ వాడాల్సి వస్తుందని.. తర్వాత సర్జరీకి దాదాపు రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. దీంతో అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలని లింగమయ్య కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని, తమ తండ్రి ప్రాణాలను కాపాడాలని లింగమయ్య కుమారుడు విక్రమ్, కుమార్తె పరిమళ వేడుకుంటున్నారు. దాతలు నేరుగా లింగమయ్య కుమారుడు విక్రమ్ నంబర్ 9963324224కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని, సహాయం అందించవచ్చు. -
మనసున్న కన్నయ్య !
చిత్తూరు: రోడ్డుపై వంద రూపాయల నోటు కనిపిస్తే.. ఎవరూ చూడకముందే గభాలున జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది ఏకంగా రూ.5 లక్షల నగదు దొరికితే.. మనదికానిది అర్ధరూపాయైనా అవసరం లేదనుకున్నాడో ఆర్టీసీ ఉద్యోగి. బస్టాండ్‌లో దొరికిన రూ.5 లక్షలను పోగొట్టుకున్నవారికే అందజేశాడు. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులురెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అతడికి ఇచ్చేందుకు శనివారం రూ.5 లక్షల నగదుతో బయలుదేరిన అతడి తల్లి నవనీతమ్మ నగదు బ్యాగ్‌ను చిత్తూరు ఆర్టీసీ బస్టాండులో మరిచిపోయి బెంగళూరు బస్సు ఎక్కి వెళ్లిపోయారు. అక్కడే విధి నిర్వహణలో ఉన్న చిత్తూరు ఆర్టీసీ టూ డిపో కంట్రోలర్ కన్నయ్య ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సంచిని చూసి అందులో రూ.5 లక్షల నగదు, సెల్‌ఫోన్ ఉన్నాయని గుర్తించి అధికారులకు అందజేశారు. ఇంతలో బస్సు జాగ్రత్తగా ఎక్కారో లేదో తెలుసుకోవడానికి నవనీతమ్మకు ఆమె ఇంట్లో పనిచేస్తున్న కవిత ఫోన్ చేసింది. నగదు బ్యాగ్‌లో ఉన్న ఆ ఫోన్‌ను రిసీవ్ చేసుకున్న కన్నయ్య... కవితను వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు పిలింపించారు. ఎస్ఐ కృష్ణయ్య సమక్షంలో రూ.5 లక్షలు, సెల్‌ఫోన్ ఆమె చేతికి అందచేశారు. పోలీసులు ఈ విషయాన్ని శ్రీనివాసులురెడ్డికి ఫోన్లో తెలియజేశారు. కన్నయ్యను పోలీసులు, ఆర్టీసీ అధికారులు ప్రశంసించారు. కన్నయ్య నిజాయితీకి అవార్డు ఇప్పిస్తామని చెప్పారు. -
సరూర్ నగర్లో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్ : సరూర్ నగర్లో ఓ ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్లాట్ రిజిస్టేషన్ విషయంలో అధికారులు వేధిస్తున్నారనే మనస్తాపంతో రమేష్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కరీంనగర్ వాసి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.