ఆర్టీసీ కార్మికుడు అనుమానాస్పద మృతి | rtc contract employee suspicious death in kurnool distirict | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కార్మికుడు అనుమానాస్పద మృతి

Published Mon, May 11 2015 10:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM

rtc contract employee suspicious death in kurnool distirict

నందికొట్కూరు : కర్నూలు జిల్లాలో ఓ ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున నందికోట్కూరు ఆర్టీసీ డిపోలో జరిగింది. వివరాలు.. కర్నూలుకు చెందిన చైతన్యకుమార్(24) ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా డిపోలోని గ్యారేజీలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యాడు. కాగా, సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు వరకు పని చేసిన అనంతరం గ్యారేజ్ లోనే నిద్రపోయాడు. అయితే తెల్లవారే సరికి అతను మృతి చెందాడు. సోమవారం ఉదయం డిపోకు వచ్చిన తోటి కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చైతన్యకుమార్ గుండెపోటుతో కానీ, ఏదైనా విషపు పురుగు కరవడంతోనే చనిపోయి ఉంటాడా అనే పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement