
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమల:
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది.
నిన్న(గురువారం) స్వామివారిని 96,361 మంది భక్తులు దర్శించుకోగా.. శ్రీవారి హుండీకి రూ. 3.19 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.