నెలాఖరులోపు మూడో జోన్‌కు సాగర్‌ జలాలు | sagar water realeased on third zone this month ending | Sakshi
Sakshi News home page

నెలాఖరులోపు మూడో జోన్‌కు సాగర్‌ జలాలు

Published Sun, Oct 16 2016 10:08 PM | Last Updated on Tue, Jun 4 2019 6:19 PM

నెలాఖరులోపు మూడో జోన్‌కు సాగర్‌ జలాలు - Sakshi

నెలాఖరులోపు మూడో జోన్‌కు సాగర్‌ జలాలు

రెడ్డికుంట(రెడ్డిగూడెం) : చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్‌ మూడవ జోన్‌ కింద అయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసి రైతులకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. మండలంలోని రెడ్డికుంటలో ఆదివారం ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెలాఖరులోపు రెండున్నర టీఎంసీలు సాగర్‌ మూడో జోన్‌కు మైలవరం, నూజివీడు బ్రాంచి కెనాల్‌కు సరఫరా అవుతాయని  మంత్రి తెలిపారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు నీటి విడుదలకు అంగికారం తెలిపిందని చెప్పారు. సాగర్‌ జలాలు విడుదలైన వెంటనే సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చెరువులు నింపుకోవాలని సూచించారు.చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులు కూడా రూ.4.909 కోట్లతో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకం పూర్తయితే సాగర్‌ మూడె జోన్‌ పరిధిలోని అయకట్టుకు నిరంతరం గోదావరి జలాలు సరఫరా అవుతాయన్నారు. అశభావం వ్యక్తం చేశారు. ఉదయం పోలవరం ప్రాజెక్టు గేట్లు డిజైన్‌ను తిరుపతి వేంకటేశ్వరస్వామి పాదాల వద్ద  ఉంచి స్వామి వారి అశీస్సులు అందుకున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2018లోపు పూర్తిచేస్తామన్నారు. ఈ సందర్భంగా ధాన్యం మద్దతు ధరను పెంచాలని పలువురు రైతులు అయనను కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఈ అర్జునరావు, డీఈ శ్రీనివాసరావు, విజయబాబు, విస్సన్నపేట 25వ డీసీ చైర్మన్‌ నాదెళ్ల చెన్నకేవశరావు తదితరులు పాల్గొన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement