రాయచోటిటౌన్: పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం రాయచోటి – కడప రోడ్డు మార్గంలోని ప్రేమాలయం వద్ధాశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు చింతం వెంకటరెడ్డి శతాధిక వద్ధులను ( 100 సంవత్సరాలు నిండిన ఐదుగురుని) సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పెద్దల మాటలు, సూచనలు పాటించాలన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి బసిరెడ్డి మాట్లాడుతూ వద్ధులను ఇలా ఆశ్రమాలలో వదిలేయడం పద్ధతి కాదన్నారు. కష్టపడి చదువు చెప్పించి వద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులను మలి వయసులో వదిలేయడం బాధాకరమన్నారు. అనంతరం శతాధిక వద్ధులను సన్మానించి, అందరికీ వస్త్రాలు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి, మాజీ రెస్కో చైర్మన్ కష్ణారెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేత కొండారెడ్డి, మానవత సేవాసంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి, లయన్ హైదరాబాద్ గవర్నర్ డాక్టర్ ఎం. రాజగోపాల్‌రెడ్డి, రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ పబ్బిశెట్టి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.