ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రామాపురంలో అన్నపరెడ్డి బసిరెడ్డి(38) శనివారం ఉదయం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటార్ ఆన్ చేస్తుంటగా విద్యుత్ షాక్ కొట్టింది. గమనించిన తోటి రైతులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.