basireddy
-
సినిమా తీయడానికి ఎవరూ ముందుకు రాలే.. ఇప్పుడదే మూవీ హౌస్‌ఫుల్!
చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే! తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను, అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ తీసిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్, చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి నటీనటులుగా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. 'చిన్న సినిమా అయినా కథలో మంచి కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది. అలాంటి మంచి కంటెంట్ తో వచ్చిన ఈ రాజ్ కహాని సినిమాను మనమందరం ప్రోత్సహించి బిగ్ హిట్ చెయ్యాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తే ఇంకా మంచి చిత్రాలు తీస్తారు' అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమా తీశాడు. కరీంనగర్ లోని తిరుమల థియేటర్ లో వరుసగా ఏడవ రోజు కూడా హౌస్ ఫుల్‌గా రన్ అవ్వడం చాలా మంచి విషయం. ఇలాగే వీరు ముందు ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అన్నారు. చిత్ర దర్శకులు, హీరో రాజ్ కార్తికేన్ మాట్లాడుతూ.. 'మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన నేను నా చిన్నప్పుడు సినిమా చూడడానికే ఎంతో ఇబ్బంది పడేవాన్ని. గత రెండు సంవత్సరాలుగా ఎంతోమంది నిర్మాతలకు ఈ కథ వినిపించా. ఎవరూ తీయడానికి ముందుకు రాలేదు. చివరకు నేనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ సపోర్ట్ తో సినిమా స్టార్ట్ చేశాము. కానీ కొంత కాలానికి కరోనా రావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించాం. మా సినిమాను పెద్దలకు ప్రివ్యూ వేయడంతో సినిమా చాలా బాగుందని అనడంతో ఎంతో ధైర్యం వచ్చింది. ఈ సినిమాను విడుదల చేసే స్థోమత లేకున్నా ఓన్ గా సినిమా రిలీజ్ చేశాము' అన్నారు. -
ఫిలిం చాంబర్ నూతన అధ్యక్షుడు ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్‌కు బసిరెడ్డి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 22 ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై విజయం సాధించారు. బసిరెడ్డిని నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఎన్నికలో మొత్తం 42 మంది ఈసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చదవండి: హీరోగానే కాదు షూటర్‌గా అదరగొట్టిన అజిత్.. -
అన్నింట్లో ఫస్ట్
సాక్షి, కడప : జిల్లా రవాణాశాఖ రాబడిలో దూసుకుపోవడంతోపాటు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలువడంతో సంబంధితశాఖ మంత్రి, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. రవాణాశాఖను అభివృద్ధి బాటలో నడిపిస్తూనే ప్రమాదాల నివారణ, అధిక రాబడి సాధించిన నేపథ్యంలో ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ మల్లెపల్లె బసిరెడ్డిని సత్కరించారు.2016–17లో రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్ జిల్లా అన్ని పన్నుల వసూళ్లతోపాటు లక్ష్యాలను అధిగమించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2017–18 సంవత్సరానికి సంబంధించి ఆరు నెలల పన్నుల వసూళ్లలో కూడా రాష్ట్ర స్థాయిలో మళ్లీ మొదటి స్థానం సాధించింది. ఇందుకుగాను మంత్రి, ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించి బహుమతులను అందజేశారు.పలువురు బసిరెడ్డికి అభినందనలు తెలియజేశారు. వైఎస్సార్ జిల్లా రవాణాశాఖ డీటీసీగా పనిచేస్తున్న బసిరెడ్డి కర్నూలుకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రవాణాశాఖ రాబడి పెంచుతూనే లక్ష్యాలను అధిగమించడం, ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేయడం పట్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద సత్కరించారు. విజయవాడలోని రవాణాశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, కమిషనర్ బాలసుబ్రమణ్యం అభినందించారు. మిగతా అధికారులు ఈయనను స్ఫూర్తిగా తీసుకుని వృత్తిలో రాణించాలని వారు సూచించారు. -
శతాధిక వద్ధులకు ఘన సన్మానం
రాయచోటిటౌన్: పిల్లలకు చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలని మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం రాయచోటి – కడప రోడ్డు మార్గంలోని ప్రేమాలయం వద్ధాశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు చింతం వెంకటరెడ్డి శతాధిక వద్ధులను ( 100 సంవత్సరాలు నిండిన ఐదుగురుని) సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పెద్దల మాటలు, సూచనలు పాటించాలన్నారు. జిల్లా రవాణాశాఖ అధికారి బసిరెడ్డి మాట్లాడుతూ వద్ధులను ఇలా ఆశ్రమాలలో వదిలేయడం పద్ధతి కాదన్నారు. కష్టపడి చదువు చెప్పించి వద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రులను మలి వయసులో వదిలేయడం బాధాకరమన్నారు. అనంతరం శతాధిక వద్ధులను సన్మానించి, అందరికీ వస్త్రాలు, అన్నదానం చేశారు. కార్యక్రమంలో అర్బన్ సీఐ మహేశ్వరరెడ్డి, మాజీ రెస్కో చైర్మన్ కష్ణారెడ్డి, రాయలసీమ విద్యాసంస్థల అధినేత కొండారెడ్డి, మానవత సేవాసంస్థ వ్యవస్థాపకుడు రామచంద్రారెడ్డి, లయన్ హైదరాబాద్ గవర్నర్ డాక్టర్ ఎం. రాజగోపాల్‌రెడ్డి, రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ పబ్బిశెట్టి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని రామాపురంలో అన్నపరెడ్డి బసిరెడ్డి(38) శనివారం ఉదయం విద్యుదాఘాతంతో మృతిచెందాడు. పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లి మోటార్ ఆన్ చేస్తుంటగా విద్యుత్ షాక్ కొట్టింది. గమనించిన తోటి రైతులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దాంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నకిలీ నేషనల్ పర్మిట్ల ముఠా అరెస్ట్
‘సాక్షి’ కథనంతో స్పందించిన అధికారులు ముగ్గురు నిందితులతో పాటు కంప్యూటర్ల స్వాధీనం పలమనేరు: లారీ యజమానులకు నకిలీ నేషనల్ పర్మిట్లను అంటగట్టి లక్షల్లో స్వాహా చేసిన ఓ ముఠాను పలమనేరు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరు నకిలీ పర్మిట్ల తయారీలో ఉపయోగించే కంప్యూటర్లు, ప్రింట ర్లు, ఖాళీ పర్మిట్ కాగితాలు, నకిలీ సీళ్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ బాలయ్య కథనం మేరకు.. పలమనేరు చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన పలు లారీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నకిలీ పర్మిట్లు కలిగి ఉన్నందున అక్కడి ఆర్టీవో అధికారులకు పట్టుబడ్డాయి. సంబంధిత వాహనాల యజమానులు వాటిని పొందిన ఆర్టీవో ఏజెంట్లను నిలదీశారు. ఈ వ్యవహారంపై గత నెలలో ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలను ప్రచురించింది. దీనిపై అప్రమత్తమైన డీటీసీ బసిరెడ్డి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. స్థానిక ఎంవీఐ మధుసూదన్ నకిలీ పర్మిట్ల వ్యవహారంపై పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. పట్టణానికి చెందిన అహ్మద్‌బాషా ఆర్టీవో ఏజెంట్. ఇతని వద్ద సల్మాన్‌ఖాన్ పనిచేసేవాడు. కొన్నేళ్ల నుంచి అహ్మద్‌బాషా నకిలీ నేషనల్ పర్మిట్లను వాహన యజమానులకు తెలి విగా అంటగట్టేవాడు. దీన్ని గమనించిన అతని శిష్యుడు సల్మాన్‌ఖాన్ సైతం అదేబాట పట్టాడు. పట్టణంలోని ఎంవీఐ కార్యాల యంలో ఆ శాఖ లోగో కలిగి ఉన్న పలు ఖాళీ పర్మిట్ పేపర్లను చోరీ చేశారు. చిత్తూరు కార్యాలయంలోని సెక్రటరీ పేరుతో ఓ నకిలీ సీలును తయారుచేసి కంప్యూటర్ సాయంతో వీరే పర్మిట్లను అందజేశారు. ఇప్పటి వరకు 29 మందికి నకిలీ పర్మిట్లను అందజేసి రూ.5.65 లక్షలను పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎలా పట్టుబడ్డారంటే.. పోలీసులు కొన్నాళ్లుగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. సల్మాన్‌ఖాన్ అనే నిందితుడు బెంగళూరు నుంచి ఓ బస్సులో పట్టణంలోని రంగాపురం వద్ద దిగగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా గురువు అహ్మద్‌బాషాను పట్టుకున్నారు. వీరిని విచారించగా అసలు విషయం బయటపడింది. తమకు పట్టణానికే చెందిన శివప్రసాద్ అనే అతను నకిలీ సీల్‌ను తయారుచేసి ఇచ్చారని చెప్పారు. అతన్ని సైతం పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి కంప్యూటర్లు, ప్రింటర్లు, నకిలీ సీళ్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.