అనంతపురం అర్బన్ : కలెక్టరేట్‌లో ఈ నెల 3వ తేదీ (సోమవారం) కలెక్టర్ కోనశశిధర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘీక సంక్షేమ శాఖ డీడీ ఎస్.రోషన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు రెవెన్యూ భవన్‌లో ‘మీ కోసం’ కార్యక్రమంతో పాటు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ కూడా జరుగుతుందని తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలు, సంఘాల నాయకులు హాజరై సమస్యలపై అర్జీలు ఇచ్చుకుని పరిష్కారం పొందాలని తెలిపారు.