వెంకటాపురం: ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెం వద్ద శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో బాలుడు చనిపోయాడు. వివరాలివీ... చర్ల మండలం గొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొప్పుల సతీష్, రాణి దంపతుల కుమారుడు సాయిచరణ్(9) అబ్బాయిగూడెంలో బంధువుల ఇంటికి వచ్చాడు. అతడు శనివారం ఉదయం రోడ్డు పక్కన ఆడుకుంటుండగా భద్రాచలం నుంచి వాజేడు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సాయిచరణ్‌ను 108 వాహనంలో వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బాలుడు చనిపోయాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.