ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం: సీఎం | SCs and STs growth target: CM | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం: సీఎం

Published Fri, Mar 25 2016 3:14 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం: సీఎం - Sakshi

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం: సీఎం

{పతి నియోజకవర్గంలోనూ ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల
ఎస్సీ, ఎస్టీలకు అందించే పథకాలకు ఆధార్ అనుసంధానం

 

హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల తలసరి ఆదాయం పెంచేలా.. సామాజిక అంతరాలు తొలగిపోయేలా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ల అమలుపై మంత్రులు రావెల కిశోర్‌బాబు, పీతల సుజాత, ఆ వర్గాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. 2016-17 బడ్జెట్‌లో ఎస్సీ సబ్ ప్లాన్‌కు రూ.8,724 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్‌కు రూ.3,099 కోట్లు కేటాయించామన్నారు. దళితవాడలు, గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికీ ఒక ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అందించే అన్ని పథకాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

 
ప్రైవేట్ భాగస్వామ్యంతో గృహాలు...

ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణంలో ప్రైవేట్ నిర్మాణదారులకు భాగస్వామ్యం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం రాత్రి సచివాలయంలో గృహ నిర్మాణంపై సీఎం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లు ఎలా ఉండాలనే అంశంపై మంత్రుల బృందంతో చర్చించి వెంటనే ఒక స్పష్టతకు రావాలని ఆధికారులను సీఎం ఆదేశించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement