జిల్లాలో నిషేధాజ్ఞలు : ఎస్పీ | section 30in east godavari | Sakshi
Sakshi News home page

జిల్లాలో నిషేధాజ్ఞలు : ఎస్పీ

Published Tue, Nov 1 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

section 30in east godavari

కాకినాడ క్రైం : నెల రోజుల పాటు జిల్లాలో నిషేధాజ్ఞలు విధిస్తూ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టరాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెక్షన్‌-30 ప్రకారం శాంతి భద్రతలు, అంతర్గత భద్రత పరిరక్షణలో భాగంగా నవంబర్‌ ఒకటి నుంచి 30 వరకూ కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, రంపచోడవరం, చింతూరు సబ్‌ డివిజన్ల పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి  సమావేశాలు, ఆందోళనలు నిర్వహించరాదని, మైక్‌లతో ప్రచారం చేపట్టరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement