రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు జట్టు ఎంపిక | selected team for state level body building sports | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు జట్టు ఎంపిక

Published Wed, Sep 28 2016 10:28 PM | Last Updated on Fri, Oct 5 2018 6:29 PM

ఎంపికైన క్రీడాకారులతో అసోసియేషన్‌ సభ్యులు - Sakshi

ఎంపికైన క్రీడాకారులతో అసోసియేషన్‌ సభ్యులు

కొత్తగూడెం అర్బన్‌ : నల్గొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో వచ్చేనెల 3వ తేదీన జరగనున్న రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలకు కొత్తగూడెం నేతాజీ వ్యాయామశాల బాడీ బిల్డర్స్‌ ఎంపికైనట్లు బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేష్‌ తెలిపారు. బుధవారం నేతాజీ వ్యాయామశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపికైన క్రీడాకారుల్లో జర్పుల లక్ష్మీనారాయణ, మధుకుమార్, నర్సయ్య, మన్మథకుమార్, మాలోత్‌ లక్ష్మణ్, దుర్గేష్‌ ఉన్నారని చెప్పారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికైన క్రీడాకారులు బహుమతులు గెలుపొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామశాల కోచ్‌ కూచన కృష్ణారావు, చైర్మెన్‌ మామిడి శ్రీనివాస్, సీనియర్‌ క్రీడాకారులు తమ్మిశెట్టి మోహన్‌రావు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement