షీ ఆటోలతో ఉపాధి | self employment wih she auto | Sakshi
Sakshi News home page

షీ ఆటోలతో ఉపాధి

Published Sat, Jul 30 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

self employment wih she auto

శ్రీకాకుళం అర్బన్‌: షీ ఆటోలతో  స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పిస్తామని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ త్రినాథరావు తెలిపారు. ఆంధ్రా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణ డ్రైవింగ్‌కే పరిమితం కారాదని, అవసరమైతే చిన్నచిన్న రిపేర్లు చేయడం నేర్పాలని శిక్షకులకు సూచించారు.
 
ఆటోలు నడుపుతూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారందరికీ ప్రత్యేక డిజైన చేసిన ఆటోలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తామన్నారు. ముందుగా కొన్ని స్కూళ్ల పిల్లల తరలింపు బాధ్యతలను కూడా అప్పగిస్తామన్నారు. ఎంపీ నిధులతో మహిళా ఆటో డ్రైవర్లకోసం పట్టణంలో మూడు ఆటో స్టాండ్లు నిర్మించేందుకు  శ్రీకాకుళం ఎంపీ ముందుకు వచ్చారని తెలిపారు. ఏబీఐఆర్‌డీ డైరెక్టర్‌ బగాన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా మొట్టమొదటి సారిగా మíß ళలకు ఆటో డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం 17 మంది మహిళలకు ఈ నెల 15 నుంచి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 33 బ్యాచ్‌లలో మొత్తం 8,500 మందికి వివిధ ట్రేడుల్లో శిక్షణ ఇచ్చిన ట్టు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు 08942–222369, 95534 10809 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డ్రైవింగ్‌ స్కూల్‌ ప్రతినిధి గిరి, శిక్షణ సంస్థ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement