she auto
-
‘ఆటో’ రాణులు
త్వరలో ‘షీ’ ఆటోలు – మెప్మా ఆధ్వర్యంలో 200 మంది మíßహిళలకు ఉపాధి – 90 రోజుల పాటు మహిళలకు శిక్షణ – ప్రయోగాత్మకంగా కర్నూలులో శ్రీకారం కల్లూరు(రూరల్)/కర్నూలు(టౌన్): హైదరాబాద్ తరహాలో కర్నూలులోనూ షీ ఆటోలకు ప్రణాళిక సిద్ధమైంది. మహిళలు ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించే పరిస్థితి లేకపోవడం.. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాలతో ఇళ్లకు చేరుకునేందుకు బిక్కుబిక్కుమనే పరిస్థితుల్లో తెరపైకి వచ్చిన షీ ఆటో చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల్లో జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అనుమతితో కర్నూలులో ప్రయోగాత్మకంగా షీ ఆటోలు నడిపేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) శ్రీకారం చుడుతోంది. శిక్షణను ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పించే దిశగా వేస్తున్న ఈ అడుగు ఎంతో మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపనుంది. మహిళల రక్షణే ధ్యేయంగా.. మగ వారికే పరిమితమైన ఆటో రంగంలో రాణించేందుకు మహిళలు కూడా ముందుకొస్తున్నారు. కర్నూలు నగరంలో 20వేలకు పైగా ఆటోలు ఉన్నాయి. ఉపాధి పేరిట ఆటోలు నడుపుతున్న కొందరు డ్రైవర్లు మహిళలను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. ఇందుకు జిల్లాలోని ఆయా పోలీసుస్టేషన్లలో నమోదవుతున్న కేసులో ఉదాహరణలు. రెండేళ్ల క్రితం కర్నూలు నగరానికి చెందిన రవికుమార్ అనే ఆటో డ్రైవర్ మహిళలకు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడడం, దోచుకోవడం వంటి ఘనలతో ఆటో డ్రైవర్లు అంటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. చీకటి పడితే మహిళలు ఒంటరిగా ఆటోలో ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు భరోసాగా షీ ఆటోలను మెప్మా తెరపైకి తీసుకొచ్చింది. 200 మందికి ఉపాధి.. 90 రోజుల పాటు శిక్షణ ‘షీ’ ఆటోల పేరుతో పొదుపు గ్రూపుల్లో మహిళలను 200 మందిని ఎంపిక చేసి డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. 90 రోజుల పాటు శిక్షణనిచ్చి ఆటోలు కొనుగోలు చేసేందుకు రుణం సైతం అందిస్తారు. మొదట 100 మంది మహిళలకు ఉచిత వసతి, భోజనంతో పాటు ఆటో డ్రైవింగ్ నేర్పించి ఆ తర్వాత మరో వంద మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను ‘షీ’ ఆటోలతో అనుసంధానం చేసి నిరంతరం ఉపాధి కల్పించేందుకు మెప్మా అధికారులు నివేదికలు రూపొందించారు. విద్యార్థులను స్కూళ్ల వద్ద వదిలిపెట్టడం.. ఆ తర్వాత తిరిగి ఇళ్లకు చేర్చడం ద్వారా ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. మిగతా సమయంలో నగరంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి నెలకు కనీసం రూ.8వేల నుంచి రూ.10వేలు సంపాదించే వెసులుబాటు కల్పించనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న పొదుపు మహిళలను ఎంపిక చేసి బ్యాంకు లింకేజీతో రుణాలు ఇప్పించడం.. నెలసరి వాయిదాల రూపంలో తిరిగి చెల్లించేందుకు చర్యలు చేపడుతున్నారు. ‘షీ’ఆటోలకు త్వరలో శ్రీకారం పొదుపు గ్రూపు మహిళలచే షీ ఆటోలను త్వరలో నడుపుతాం. మహిళలకు శిక్షణనిచ్చి రుణం ద్వారా ఆటోలను పంపిణీ చేస్తాం. ఇందుకోసం సోమవారం జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకోనున్నాం. 200 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తాం. -
షీ ఆటోలతో ఉపాధి
శ్రీకాకుళం అర్బన్: షీ ఆటోలతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పిస్తామని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ త్రినాథరావు తెలిపారు. ఆంధ్రా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శిక్షణ డ్రైవింగ్‌కే పరిమితం కారాదని, అవసరమైతే చిన్నచిన్న రిపేర్లు చేయడం నేర్పాలని శిక్షకులకు సూచించారు. ఆటోలు నడుపుతూ ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారందరికీ ప్రత్యేక డిజైన చేసిన ఆటోలను 50 శాతం రాయితీపై సరఫరా చేస్తామన్నారు. ముందుగా కొన్ని స్కూళ్ల పిల్లల తరలింపు బాధ్యతలను కూడా అప్పగిస్తామన్నారు. ఎంపీ నిధులతో మహిళా ఆటో డ్రైవర్లకోసం పట్టణంలో మూడు ఆటో స్టాండ్లు నిర్మించేందుకు శ్రీకాకుళం ఎంపీ ముందుకు వచ్చారని తెలిపారు. ఏబీఐఆర్డీ డైరెక్టర్ బగాన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రా బ్యాంకు గ్రామీణాభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా మొట్టమొదటి సారిగా మíß ళలకు ఆటో డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. మొత్తం 17 మంది మహిళలకు ఈ నెల 15 నుంచి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 33 బ్యాచ్‌లలో మొత్తం 8,500 మందికి వివిధ ట్రేడుల్లో శిక్షణ ఇచ్చిన ట్టు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు 08942–222369, 95534 10809 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ ప్రతినిధి గిరి, శిక్షణ సంస్థ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. -
'షి ఆటో' ప్రారంభించిన చంద్రబాబు
* 49 మంది మహిళలకు ఆటోల పంపిణీ * విజయవాడలో వినూత్న ప్రయోగం విజయవాడ: విజయవాడలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పురుషులకు ధీటుగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని, అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో ఆయన వారికి పెద్దఎత్తున ఆటో రిక్షాలు పంపిణీ చేశారు. బెజవాడలోని తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు శుక్రవారం ‘షి ఆటో’ పథకం కింద ఆటో రిక్షాలను అందించారు. 49 మంది మహిళలకు సుమారు రూ. కోటి విలువ చేసే ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు. పూర్తిగా సీఎన్జీతో నడిచే ఈ ఆటోలు పర్యావరణ రహితమే కాకుండా, మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించడానికి 'షి ఆటో' దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మహిళా ఆటో డ్రైవర్లు.. చంద్రబాబును శాలువా కప్పి సత్కరించారు. రూ.1,91,000 విలువ చేసే ఈ ఆటోలకు 7 శాతం సబ్సిడీ అందించిన ప్రభుత్వం.. మిగిలిన మొత్తాన్ని 40 ఇన్స్టాల్మెంట్లలో నెలకు రూ.4,500 చొప్పున చెల్లించే అవకాశం కల్పించింది. నెలకు రూ. 18 వేల వరకు ఆటోలు నడపడం ద్వారా లబ్దిదారులు ఆర్జించవచ్చని అధికారులు చెప్పారు.