వరంగల్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకూ జరుగనున్న ఐసెట్ పరీక్షకు సెట్-బి కోడ్ ప్రశ్నాపత్రాన్ని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఎంపిక చేశారు. కాకతీయ యూనివర్సిటీలో గురువారం ఉదయం ఆయన ఈ ప్రశ్నపత్రాన్ని ఎంపికచేశారు. ఐసెట్‌కు 72,448 మంది దరఖాస్తు చేసుకున్నారని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ ఈ సందర్బంగా తెలిపారు. 16 ప్రాంతీయ కేంద్రాలతో పాటు 127 పరీక్షా కేంద్రాలలో ఐసెట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఒక నిముషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని పాపిరెడ్డి స్పష్టంచేశారు.
తెలంగాణ ఐసెట్‌కు సెట్-బి కోడ్ పేపర్ ఎంపిక
Published Thu, May 19 2016 8:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM
Advertisement
Advertisement