సాక్షి, హైదరాబాద్ : కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. కరోనా లాక్‌డౌన్ ఎప్పటివరకు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మే 7 తర్వాతి పరిస్థితులను బట్టి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఒక వేళ మే నెల మొత్తం లాక్‌డౌన్ ఉంటే జూన్ మూడో, నాలుగో వారంలో పరీక్షలు నిర్వహిస్తాం. డిగ్రీ ఆ స్థాయి ఉన్న పరీక్షలు నిర్వహిస్తాం కానీ, పాస్, ఫెయిల్ అనే మాట ఉండదు. డైరెక్ట్ ప్రమోట్ చేస్తాం. ఇప్పటి వరకు పూర్తయిన సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయి. విద్యార్థుల సిలబస్ కోసం కాలేజ్‌లతో మాట్లాడుతున్నాం. ఆన్‌లైన్ తరగతులు కూడా నిర్వహిస్తాం. కామన్ టెస్ట్‌ల తర్వాత కొత్త విద్యా సంవత్సరం నెల, రెండు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంద’’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment