మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి జైలుశిక్ష
సారవకోట : మండలంలో ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఏడుగురికి పాతపట్నం కోర్టు న్యాయమూర్తి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. మండలంలోని పలుచోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమంలో మండలానికి చెందిన ఏడుగురిపై ఇటీవల కేసులు పెట్టామని దీనిపై విచారణ చేపట్టిన ఆయన వారికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించారన్నారు.