ఖమ్మంలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు | sex rocket revealed in khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

Published Sun, Jul 17 2016 3:27 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

ఖమ్మంలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు - Sakshi

ఖమ్మంలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు

ఖమ్మంక్రైం : నగరంలోని త్రీటౌన్ పరిధిలో కొంతకాలంగా నడుస్తున్న సెక్స్ రాకెట్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మొగిలి వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ మహిళ వ్యవసాయ మార్కెట్ రోడ్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతుంది. విటులను వాట్సాఫ్, సెల్‌ఫోన్‌లో ఆకర్షిస్తూ అమ్మారుులను రప్పిస్తూ ఉంటుంది.

విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ మొగిలి ఆధ్వర్యంలో ఎఎస్‌ఐ బాబు, ఐటీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ తోటకూరి వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి దాడి చేయగా వ్యభిచారంతో పాటు పేకాటను సైతం నడిపిస్తున్నట్లు బయటపడింది. దీంతో పోలీసులు అక్కడ ఉన్న నలుగురు మహిళలు, విటులైన మండల నవీన్, షేక్ ఆరీఫ్, కురం వెంకటేశ్వర్లు, షేక్ షరీఫ్, మలీదు జగన్, షరీఫ్ పాషాలను అరెస్ట్ చేసి వారి వద్ద రూ. 9300 నగదు, 7 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అరుున వారిలో ముగ్గురిది రఘునాథపాలెం మండలం బల్లేపల్లి కాగా మరో ఇద్దరు ఖమ్మం నగరానికి చెందిన వారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement