వృద్ధురాలిపై అత్యాచారయత్నం | sexual attacks on 70 years old woman | Sakshi
Sakshi News home page

వృద్ధురాలిపై అత్యాచారయత్నం

Published Sat, Nov 12 2016 11:37 PM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

sexual attacks on 70 years old woman

ఆత్మకూరు : మండలంలోని వై.కొత్తపల్లి వద్ద శనివారం 70 సంవత్సరాల వయసు కల్గిన వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆత్మకూరు ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు .... కళ్యాణదుర్గం మండలం మద్దినాయనపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు శనివారం ఆత్మకూరు మండలం వై. కొత్తపల్లి గ్రామానికి నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అటు వైపు వచ్చి తాము కొత్తపల్లి గ్రామానికే వెళ్తున్నామని కారులో ఎక్కించుకున్నారు.

కొత్తపల్లి గ్రామం దాటాక వాహనం ఆపమని ఆ వృద్ధురాలు కోరగా వారు వినకపొగా  అత్యాచారానికి యత్నించారు.  ఆమె గట్టిగా కేకలు  వేయడంతో  అటుగా దారి వెంట వస్తున్న కొందరు కారును ఆపడానికి ప్రయత్నించారు. దీంతో వారు ఆ వృద్ధురాలిని వాహనంలో నుంచి కిందకి తోసి వెళ్లిపోయారు. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో  పొలాల్లో ఉన్న వారు 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement