‘సీఎం మాటే చెల్లుబాటు కావడం లేదు’
శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ
కామారెడ్డి : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తులను స్వాధీనం చేసుకునే విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం సిగ్గుచేటని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. మంగళవారం కామారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఆమరణ దీక్ష చే పట్టిన విద్యార్థి సంఘాల నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి ఫోన్ చేసి సమస్యపై మాట్లాడా రు. ఈ సందర్భంగా షబ్బీర్‌అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 నుంచి రా ష్ట్రం ఏర్పాటయ్యేదాకా సాగిన పోరాటంలో కా మారెడ్డి కాలేజీ విద్యార్థుల పాత్ర ఎంతో ఉందన్నారు.
కళాశాలకు సంబంధించి సొసైటీ సభ్యులతో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమో, సొ సైటీ ని రద్దు చేయించి ప్రభుత్వమే స్వాధీనం చే సుకోడమో చేయాల్సి ఉందన్నారు. విద్యార్థుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అద్యక్షురాలు జమునారాథోడ్, ఎల్లారెడ్డి నియోజక వర్గ ఇన్‌చార్జి నల్లమడు గు సురేందర్, కామారెడ్డి కాంగ్రెస్ నేతలు కైలాస్‌శ్రీనివాస్, ఎడ్ల రాజిరెడ్డి, నిమ్మ మోహన్‌రెడ్డి, గూడెం శ్రీనివాస్‌రెడ్డి, అంజయ్య ఉన్నారు.