వైద్యులో.. చంద్రశేఖరా!
♦ జనరల్ ఆస్పత్రిలో పోస్టులు ఖాళీ
♦ వేధిస్తున్న సిబ్బంది కొరత అందని వైద్యం..
♦ రోగుల అవస్థలు..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్లుగా ఖాళీల కొరత వేధిస్తోంది. పనిచేస్తున్న వైద్యులు కూడా అందుబాటులో ఉండరు. 2008లో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడంతో మెరుగైన వైద్యం అందుతుందని జిల్లావాసులు ఆశించారు. పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 2012 జనవరిలో మెడికల్ కళాశాలలోని పోస్టుల భర్తీ చేయూలని 150 జీఓ విడుదలైంది. పోస్టులు భర్తీ కాలేదు.
నిజామాబాద్ అర్బన్ : జనరల్ ఆస్పత్రిని నూతనంగా నిర్మించిన ఎనిమిది అంతస్తుల భవనంలో ఏర్పాటు చేశారు. 500 పడకలు.. రోజు 650 మందికిపైగా ఔట్ పేషెంట్లు, 260 మందికిపైగా ఇన్‌పేషెంట్లు వస్తుంటారు. కళాశాల ఆస్పత్రి ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే రోగుల సంఖ్య నాలుగింతలు పెరిగింది. కానీ.. వైద్యులు, వైద్య సిబ్బంది పెరగడం లేదు. 2012లో 150 జీఓ విడుదల కాగా.. నాన్ క్లీనికల్ విభాగంలో 107, క్లీనికల్ విభాగంలో 455, ప్రిన్సిపల్ విభాగంలో 50, ఆస్పత్రి సూపరింటెండెంట్ విభాగానికి 189 పోస్టులు మంజూరు చేశారు. ఈ పోస్టులు నేటికి భర్తీ కాలేదు. త రచూ ప్రజాప్రతినిధులు కళాశాల, ఆస్పత్రికి రావడం పోస్టులు భర్తీపై హామీలు ఇ వ్వడం తప్పా అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశం లో సుదీర్ఘంగా కొనసాగిన జిల్లా మెడికల్ కళాశాల పోస్టులపై ఉస్తేతలేదు. మహబూబ్‌నగర్ కళాశాలపై చర్చించిన మంత్రి వర్గం నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జిల్లా కళాశాలపై కనీసం చర్చించకపోవడం గమనార్హం.
సిబ్బంది.. ఇబ్బంది ఇలా..
ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులను మినహాయిస్తే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 160 మంది స్టాఫ్ నర్సులకు 76 మంది పనిచేస్తున్నారు. ఫార్మాసిస్టులు ఎనిమిది మంది ఉ న్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 110 మందికి 36 మంది అందుబాటులో ఉ న్నారు. మరోవైపు సిటీస్కాన్, ఎక్స్‌రే, ల్యాబ్, ఓపి విభాగం సిబ్బంది లేరు. వీరిని వై ద్య విధాన పరిషత్ నుంచి డిప్యూటేషన్‌పైకొనసాగిస్తున్నారు. అంతేకాకుండా స్టెరిలైజేషన్, ల్యాండీ, ఇతర పారామెడికల్ సర్వీస్ విభాగం, మెడికల్ రికార్డు, పరిపాలన వి భాగం సంబంధించి 189 మంది ఉద్యోగులను ఉండాల్సి ఉండగా ఏ ఒకరిని ఇంతవరకు నియమించ లేదు. ప్రిన్సిపల్ విభాగంకు చెందిన 50 పోస్టులు మంజూరు కాగా అసలే భర్తీ కాలేదు. ఇందులో సెంట్రల్ లైబ్రరీ, సెంట్రల్ ఫొటోగ్రాఫిక్, ఇతర పారామెడికల్, ఎడ్యుకేషన్ సెల్, క్లీనికల్, నాన్ క్లీనికల్ పోస్టులు భర్తీ కావల్సి ఉంది. వీటి వ ల్ల రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గర్భిణుల వార్డు, చిన్నపిల్ల లు, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో ఇబ్బందులు అనేకం ఉన్నాయి.
సెల్ఫ్ సర్వీస్
ఆస్పత్రికి వచ్చే రోగులు వార్డు బాయ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రికి అత్యవసర సమయంలో వచ్చే బాధితులకు అత్యవసర విభాగానికి తీసుకెళ్లడం, క్లీనిక్ విభాగం తీసుకెళ్లడం, అనంతరం వార్డులలో కేటాయించేటప్పుడు రోగిని జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. రోగులకు కట్టుకట్టడంతో సహాయకారిగా ఉంటారు. కా నీ.. జనరల్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో 210 మంది వార్డు బాయ్‌లు ఉండాల్సి ఉండగా 21 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రోగులను తీసుకెళ్లడంలో రోగి బంధువులే సహాయకారిగా ఉంటున్నారు. ఎనిమిదంతస్తుల భవనం ఎక్కాలంటే రోగులతోపాటు వారి బంధువులు కూడా అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, రోడ్డు ప్రమాదాల బాధితులను తీసుకెళ్లడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆపరేషన్ థియేటర్లు పైన ఉండడం, వార్డులు పైననే ఉండడంతో వచ్చి వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. రోగి బంధువులు రోగులను ఎత్తుకొని వెళ్లాల్సి వస్తోంది.
ఉన్నా.. వారు రారు..
జనరల్ ఆస్పత్రికి 120 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారు. అంతేకాకుండా సీనియర్ రెసిడెన్షియల్ వైద్యులను కూడా కేటాయించారు. వీరు ప్ర స్తుతం 86 మందిని కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 36 మంది ప్రొఫెసర్లు మాత్ర మే పనిచేస్తున్నారు. సీనియర్ రెసిడెన్షియల్ కు సంబంధించి 42 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చాలా మంది ప్రొఫెసర్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూ పలుసార్లు గైర్హాజరవుతున్నారు. కొందరు ప్రొఫెసర్లు మాత్రం నెలల తరబడి ఆస్పత్రికి రావడం లే దు. గతంలో ఆస్పత్రి ఇన్‌చార్జి బాధ్యతలు చే పట్టిన ప్రొఫెసర్ ఒకరు నెలల తరబడి రావ డం లేదు. ఎంసీఐ వచ్చి వెళ్తున్నప్పుడు వస్తున్నారు. వీరి సంతకాలను తమ రిజిస్టరులో సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారు. ఒకరి సంత కం ఒకరు పెట్టడం వచ్చిన తరువాత ఒకేసారి సంతకాలు చేయడం కొనసాగుతోంది. నెలకు రూ.లక్షలు తీసుకుం టున్న ప్రొఫెసర్లు ఇలా గైర్హాజరవుతూ ఉన్నారు.