Government General Hospital
-
వైద్యుల నిర్లక్ష్యం... బాలింతకు కష్టం
మంచిర్యాల టౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ నెల 24న ఓ మహిళకు ప్రసవ సమయంలో వైద్యులు, సిబ్బంది కాటన్ ప్యాడ్‌ను అమర్చి డిశ్చార్జి సమయంలో తొలగించడం మర్చిపోయారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలు కీర్తిలయ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయకు ఈ నెల 24న పురిటి నొప్పులు రావడంతో మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అదేరోజు మధ్యాహ్న సమయంలో సాధారణ ప్రసవానికి ప్రయత్నించగా.. కొంత క్రిటికల్ కావడంతో ఫోర్సెప్ డెలివరీ (బలవంతపు సాధారణ ప్రసవం) చేయగా మగశిశువుకు జన్మనిచ్చింది. కీర్తిలయకు రక్తస్రావం కాకుండా ఉండేందుకు కాటన్ ప్యాడ్ అమర్చారు. అనంతరం తల్లీబిడ్డలను వార్డులోకి మార్చారు. మూడు రోజుల తర్వాత 27న సాయంత్రం కాటన్‌ప్యాడ్‌ను తొలగించకుండానే డిశ్చార్జి చేశారు. ఇంటికి వెళ్లిన బాలింత 28న సాయంత్రం అస్వస్థతకు గురికాగా 108లో చెన్నూర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్య సిబ్బంది విషయాన్ని గమనించి కాటన్‌ప్యాడ్‌ను తొలగించారు. మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాటన్ప్యాడ్ తొలగించకుండానే డిశ్చార్జి చేయడంపై బాలింత, ఆమె కుటుంబ సభ్యులు వైద్యులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలింత పరిస్థితి మెరుగ్గానే ఉండగా, పూర్తిస్థాయి చికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చందర్రెడ్డిని సంప్రదించగా.. కాటన్‌ప్యాడ్‌ను తొలగించడంలో సిబ్బంది తప్పిదం ఉందని, బాధ్యులైన వైద్యులు, సిబ్బంది వివరణ తీసుకుని ఉన్నతాధికారులకు తెలిపి, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చేతివాట.. డస్ట్‌బిన్, బకెట్, చీపుర్లు.. ఏదీ వదలడం లేదు!
వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు మెరుగైన వైద్యం, వసతులను కల్పించేందుకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో సిబ్బంది చేతివాటంతో ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని పలువురు అంటున్నారు. మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శానిటేషన్ వస్తువులైన డస్ట్‌బిన్, చీపుర్లు, ఇతర సామగ్రిని ఆస్పత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఎత్తుకెళ్లారు. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని పేషెంట్‌కేర్ విభాగంలో పని చేసే ఓ మహిళ ఆస్పత్రి నుంచి డస్ట్‌బిన్ బకెట్, చీపుర్లను పట్టుకుని బయటకు రాగా అదే ఆస్పత్రిలో పని చేసే ఓ సెక్యూరిటీగార్డ్ తన ద్విచక్రవాహనంపై వచ్చి సదరు మహిళను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే ఇదే ఘటనపై ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా చోరీ జరిగిన విషయం ఆదివారం ఉదయం తన దృష్టికి వచ్చిందని, వెంటనే సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులకు సమాచారం అందించామని తెలిపారు. ఇదిలా ఉండగా వస్తువులను ఆస్పత్రి నుంచి తీసుకెళ్లిన విషయంలో పేషెంట్కేర్లో పని చేసే మహిళ, సెక్యూరిటీగార్డుపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. -
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు..
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గత నెల 31న సాయంత్రం జబ్బు పడిన ఓ వ్యక్తిని అతని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాత... అతడితో వచ్చి న వారు ఓపీలో రిజిస్టర్ చేయించారు. వారు అతడిని రెండో అంతస్తులో వైద్యుడి వద్దకు వెళ్లాలని ఓపీ రాసిచ్చారు. అనంతరం ఆ వ్యక్తిని లిఫ్ట్ వరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ అవసరం పడింది. అక్కడ స్ట్రెచర్ లేకపోవటంతో బంధువులు అతని కాళ్లు పట్టి లాక్కెళ్లారు. అక్కడ ఉన్నవారు అది చూసి ఆశ్చర్యపోయారు. రోగి కాళ్లు పట్టి లాగుతున్నా అక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోక పోవటం గమనార్హం. అతడిని రెండో అంతస్తుకు చేర్చాక అక్కడ కూడ స్ట్రెచర్, వీల్ చైర్ అందుబాటులో లేకపోవటంతో అక్కడి నుంచి కూడా వైద్యుడి గది వరకు కాళ్లు పట్టి లాక్కెళ్లారు. స్ట్రెచర్, వీల్‌చైర్ లేకపోవడం, లాక్కెళుతున్నా సిబ్బంది పట్టించుకోక పోవటంపై విమర్శలు వస్తున్నాయి. -
కల్లు కల్లోలం..! బిత్తిరి చూపులు..వింత ప్రవర్తన..
-
వీపున కత్తిపోటు..ప్రాణం పోసిన కర్నూలు పెద్దాస్పత్రి
కర్నూలు(హాస్పిటల్): కత్తిపోట్లకు గురై వీపున కత్తితో వచ్చిన ఓ వ్యక్తికి కర్నూలు వైద్యులు సకాలంలో స్పందించి శస్త్రచికిత్స చేసి ప్రాణం పోశారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరుకు చెందిన శ్రీనివాసరెడ్డికి ఆస్తి వివాదాలు ఉండటంతో కొంత కాలంగా అనంతపురం పట్టణంలోని మారుతినగర్‌కు వచ్చి స్థిరపడ్డాడు. శనివారం రాత్రి భోజనం ముగించుకుని బయట వాకింగ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కత్తి శ్రీనివాసరెడ్డి వీపున అలాగే దిగబడిపోయింది. వెంటనే అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా కర్నూలు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. విషయం తెలుసుకున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ వెంటనే కార్డియోథొరాసిక్ హెచ్‌వోడి డాక్టర్ సి.ప్రభాకర్‌రెడ్డికి ఫోన్ చేశారు. శ్రీనివాసరెడ్డి ఆరోగ్యపరిస్థితి గురించి అక్కడి వైద్యులు, పోలీసులతో మాట్లాడారు. వెంటనే కర్నూలుకు తీసుకురండి ఆపరేషన్ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి దాటాక 1.30 గంటల సమయంలో శ్రీనివాసరెడ్డిని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. తెల్లవారుజాము నుంచే ఎక్స్‌రే, సీటీస్కాన్ తీసి కత్తి ఎంత వరకు వెళ్లిందో పరిశీలించారు. ఆదివారం ఉదయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్రలతోపాటు అనస్తీషియా ప్రొఫెసర్ డాక్టర్ కొండారెడ్డితో కలిసి శ్రీనివాసరెడ్డికి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి కోలుకుంటున్నారని వివరించారు. -
సామాన్యులకు ఊపిరి పోస్తున్న జీజీహెచ్ ‘సూపర్’
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందనున్నాయి. సామాన్యులకు ఊపిరి పోస్తున్న జిల్లా సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా జీజీహెచ్ అభివృద్ధికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. తాజాగా న్యూరో, పీడియాట్రిక్, ప్లాస్టిక్, యూరాలజీలకు సంబంధించి సర్జరీ విభాగాలు, నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియన్ సేవలు అందించేందుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు అర్బన్: కరోనా సమయంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఎంతో మందికి ప్రాణదాతగా నిలిచిన ఒంగోలు జీజీహెచ్‌కు నిత్యం పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. అత్యవసర సేవల కోసం పొరుగు జిల్లాల నుంచి కూడా ఇక్కడకు పెద్ద ఎత్తున రోగులు వస్తుంటారు. దీంతో ఈ ఆస్పత్రిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చొరవతో ఆస్పత్రిలో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను సైతం పూర్తి చేసి మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా దీనిని తీర్చిదిద్దేందుకు ఇటీవల ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. జీజీహెచ్‌లో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, అందుకు తాను ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని బాలినేని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేయాలని ఆస్పత్రి అధికారులను ఆదేశించారు. దీంతో సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్ఎంఓ చైతన్యవర్మ, ఇతర అధికారులు జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. జీజీహెచ్ భవనంలోని 112 గదిలో సూపర్ స్పెషాలిటీ ఓపీని పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 120లో అత్యాధునిక పరికరాలతో 40 పడకల సూపర్ స్పెషాలిటీ వార్డును సిద్ధం చేయనున్నారు. ఆమేరకు పనులను వడివడిగా నిర్వహిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీలో న్యూరో, పీడియాట్రిక్, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, సంబంధించిన విభాగాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నారు. అలాగే నెఫ్రాలజీ, న్యూరో ఫిజీషియర్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అభివృద్ధి ఇలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జీజీహెచ్‌లో అభివృద్ధి చేసిన పనుల్లో కొన్ని రూ.2 కోట్లతో 100 పడకల ఐసీయూ కాంప్లెక్స్, రూ.2 కోట్లతో 100 ఆక్సిజన్ బెడ్లతో కోవిడ్ ప్రత్యేక గదులు, టీడీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న ఆడిటోరియం రూ.3.5 కోట్లతో పూర్తి చేశారు. అంతేకాకుండా రూ.7.5 కోట్లతో ఎంఆర్ఐ, రూ.2.5 కోట్లతో సిటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటు చేసి రోగులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి సేవలందిస్తున్నారు. అలాగే రెండు భారీ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. ప్రజలకు అన్నీ వైద్య సేవలు జీజీహెచ్‌లో అందాలి జీజీహెచ్‌లో ప్రజలకు అన్నీ రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్నీ విభాగాల్లో సర్జరీలు నిర్వహించేలా చూస్తున్నాం. ఆరోగ్యశ్రీ ద్వారా అందించాల్సిన సేవలను పూర్తి స్థాయిలో నాణ్యంగా అందించేందుకు అన్నీ విధాలుగా సిద్ధం చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ వార్డు ఏర్పాటుతో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలవుతుంది. జీజీహెచ్‌లో వైద్య సేవలపై నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు మంచి వైద్య సేవలందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. – దినేష్ కుమార్, కలెక్టర్ జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు జీజీహెచ్‌లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జీజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు ఆలోచించి ఆ దిశగా చర్యలు చేపట్టాం. త్వరలో అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. నిరంతరం సాధారణ ఓపీలను పర్యవేక్షిస్తూ రోగులకు వైద్య సేవలు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందించేలా చూస్తున్నాం. – భగవాన్ నాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
వార్డు బాయ్స్ లేక..
కర్నూలు: రాయలసీమకే తలమానికమైన కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వార్డు బాయ్‌ల కొరత వేధిస్తోంది. ఫలితంగా రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని వారు, వివిధ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చిన వారిని బంధువులే స్ట్రెచర్లపై పరీక్షలకు తీసుకువెళ్తున్నారు. -
లక్షణాలు లేనివారిలో హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ.. ఈ పరీక్షలో స్కోర్ ఎక్కువగా ఉంటే!
కర్నూలు(హాస్పిటల్): మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిళ్లతో చిన్న వయస్సులోనే కొందరు గుండెపోటుకు గురై తనువు చాలిస్తున్నారు. కడుపునిండా తినడం వ్యాయామాలు చేయకపోవడం, కూర్చుని చేసే పనులు అధికంగా ఉండటం, జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం తదితర కారణాలతో ఇటీవల గుండెజబ్బులు ఎక్కువయ్యాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహించే ఓపీకి 200 నుంచి 250 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు. ఇన్‌పేషంట్లుగా ప్రతి నెలా 350 నుంచి 400 మంది వరకు చికిత్స అందుకుంటున్నారు. పెద్దాసుపత్రిలో ప్రతిరోజూ 400 మందికి ఈసీజీ, 40 నుంచి 50 వరకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. నంద్యాలలోని కార్డియాలజిస్టులలో ఒక్కొక్కరి వద్దకు ప్రతిరోజూ 20 నుంచి 50 మంది వరకు చికిత్స కోసం వెళ్తుంటారు. జిల్లా మొత్తంగా ప్రతిరోజూ 40 నుంచి 60 మందికి గుండె శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. లక్షణాలు లేనివారిలో రిస్క్ ఎక్కువ గుండెజబ్బుకు సంబంధించి లాంటి లక్షణాలు లేని వారిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారి కోసం కరోనరి కాల్షియం స్కాన్ ఉపయోగ పడుతుంది. ఈ పరీక్షకు ఉపయోగించే పరికరం రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకులను, నాళాల అంచులకు ఏర్పడ్డ ఫ్లేక్(ఫలకం)లను గుర్తిస్తుంది. గుండెలో కొలెస్ట్రాల్ లోడ్ ఏ లెవెల్లో ఉందో చెప్పేస్తుంది. కరోనరి ఆర్టరి కాల్షియం స్కోర్‌ను చూపిస్తుంది. దీని ద్వారా గుండె కాల్సిఫికేషన్(బోన్ డిపోజిషన్)ను అంచనా వేస్తుంది. ఈ నివేదిక ప్రకారం భవిష్యత్‌లో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో కార్డియాలజిస్టు చెప్తారు. స్కోర్ ఎక్కువగా ఉంటే వైద్యుల సూచనలతో మందులు వాడి, భవిష్యత్‌లో హార్ట్ ఎటాక్‌ను నివారించుకోవచ్చు. జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి కరోనరి కాల్షియం స్కాన్ అందరికీ అవసరం లేదు. 40 ఏళ్లు పైబడిన వారికి రిస్క్ ఫాక్టర్స్ అధికంగా ఉంటే ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ పరీక్షలో మొదటి నుంచి చివరి వరకు చేసే ప్రక్రియకు ఐదు నుంచి పది నిమిషాల వరకు సమయం పడుతుంది. ఈ పరీక్ష ఐదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. స్కానింగ్ రిపోర్ట్‌ను బట్టి వైద్యులు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి స్పష్టంగా చెప్పగలగుతారు. స్కోర్ 400లకు పైగా ఉంటే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో మందులు వాడాలి. జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. –డాక్టర్ తేజానందన్రెడ్డి, కార్డియాలజిస్టు, కర్నూలు -
ఆ ఆస్పత్రిలో ఏం జరుగుతోంది?
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు క్రైం : ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆస్పత్రి.. సిబ్బంది వర్గపోరుకు వేదికైంది. వారు రోగుల ముందే వాగ్వాదం చేసుకుంటూ, గొడవ పడుతున్నారు. ఈ ఘటనలు ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో చోటుచేసుకుంటున్నాయి. ప్రొద్దుటూరులో ఆరు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అర్బన్ హెల్త్ సెంటర్లు గతంలో ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉండేవి. 2016 నుంచి అపోలో సంస్థకు అప్పగించారు. ఆ రోజు నుంచి ఉద్యోగులందరూ అపోలో కిందనే పని చేస్తున్నారు. ఒక్కో ఆస్పత్రిలో డాక్టర్‌తో సహా ఏడుగురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్న సమయంలో.. డీఎంహెచ్ఓకు పూర్తి అజమాయిషీ ఉండేది. ఆస్పత్రులు అపోలో సంస్థ చేతిలోకి వెళ్లాక డీఎంహెచ్ఓ పర్యవేక్షణ కొరవడినట్లు తెలుస్తోంది. కుటుంబ సంక్షేమ శాఖ నుంచి ప్రతి నెలా ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల మొత్తం నేరుగా అపోలో సంస్థకు వెళ్తున్నాయి. సంస్థ నుంచే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు పడుతున్న కారణంగా అపోలో ఉద్యోగులు డీఎంహెచ్ఓ, ఇతర జిల్లా అధికారులను లెక్క చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా డీఎంహెచ్ఓ పర్యవేక్షణ లోపించినట్లు పలువురు చెబుతున్నారు. ఇదే అదునుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే పలువురు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీలో ఉన్న ఆరోగ్య ఉపకేంద్రంలో పని చేసే సిబ్బందిపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడి సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి ఆస్పత్రి వాతావరణాన్ని చెడగొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ గొడవల్లో భాగంగా అక్కడ 8 ఏళ్లుగా పని చేస్తున్న పుష్పావతి అనే ఏఎన్ఎంను ఉన్నట్టుండి బదిలీ చేశారు. అపోలో సంస్థ ఏర్పాటు కంటే ముందు నుంచి ఏఎన్ఎంగా పని చేస్తున్న తనను అన్యాయంగా బదిలీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆమె బదిలీకి దారి తీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అన్యాయంగా బదిలీ తనకు జరిగిన అన్యాయం గురించి పుష్పావతి ఆదివారం విలేకరుల వద్ద మొరపెట్టుకుంది. బాధితురాలు తెలిపిన కథనం మేరకు.. పుష్పావతి ప్రొద్దుటూరులోని వైఎంఆర్ కాలనీ అర్బన్ హెల్త్‌సెంటర్‌లో సుమారు 8 ఏళ్ల నుంచి ఏఎన్ఎంగా పని చేస్తోంది. ఆమె క్యారీ తెచ్చుకోవడంతో మధ్యాహ్నం ఆస్పత్రిలోనే భోజనం చేసి, సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నారు. ఉదయం ఆస్పత్రికి వచ్చిన సిబ్బందిలో ఎక్కువ మంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తారు. అయితే క్యారీ తెచ్చుకోవడం వల్ల ఏఎన్ఎం పుష్పావతి మధ్యాహ్నం ఆస్పత్రిలోనే ఉంటోంది. మధ్యాహ్న సమయంలో తాను ఆస్పత్రిలో ఉండటం కొందరికి నచ్చడం లేదని ఆమె చెబుతోంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొందరు ఉద్యోగులు బ్యాచ్‌లుగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించడమే ఇందుకు కారణమని ఆరోపించింది. వాళ్ల బాగోతం ఎక్కడ బయట పడతుందోనని భావించి.. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను పంపించాలని పథకం పన్నారని వివరించింది. మూడు రోజుల క్రితం కొందరు సిబ్బంది పక్కన పడేసిన కాలం చెల్లిన మందులను తీసుకొని వచ్చి ఫార్మసీ గదిలో ఉంచారని తెలిపింది. ఎందుకు వాటిని తీసేయలేదని తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పుష్పావతిని కర్నూలు జిల్లాలోని ఆదోనికి బదిలీ చేస్తూ డీఎం ద్వారకనాథ్ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన బదిలీ ఉత్తర్వులు తీసుకొని స్వయంగా ప్రొద్దుటూరు వచ్చారు. 10వ తేదీలోగా ఆదోనిలో రిపోర్టు చేసుకోక పోతే ఉద్యోగం పోతుందని డీఎం తనను హెచ్చరించారని ఆమె తెలిపింది. ఉన్నతాధికారులు ప్రొద్దుటూరుకు వచ్చి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆమె కోరుతోంది. మీ ఇష్టమొచ్చినట్లు రాసుకోండి ఆస్పత్రిలోని సిబ్బందిపై వస్తున్న ఆరోపణలు, పుష్పావతిని ఇబ్బంది పెడుతున్న వైనంపై డీఎం ద్వారకనాథ్‌ను విలేకరులు వివరణ కోరగా.. ‘నేను చెప్పేది ఏం లేదు.. మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి.. నేను ఇక్కడికి వచ్చిన విషయం మీకు ఎవరు చెప్పారు.. ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ’ ఆగ్రహంతో ఊగిపోయారు. పుష్పావతికి బదిలీ జరగలేదని ఒక సారి, ఆదోనికి బదిలీ అయిందని, ఆమె బదిలీ ఉత్తర్వులు తీసుకోలేదని మరోసారి చెప్పుకొచ్చారు. -
అన్ని వసతులతో 4 ఆస్పత్రులు సిద్ధం
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి ఉధృతమైతే ఎదుర్కొనేలా ముందస్తు వ్యూహంతో సర్కారు మరో ముందడుగు వేసింది. ప్రతి బోధనాసుపత్రిలో కొన్ని ప్రత్యేక పడకలు, ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం కంటే ప్రత్యేకంగా 4 మెడికల్ కళాశాలల పరిధిలోని ఆసుపత్రులను కేవలం కరోనా వైరస్ సోకిన వారికి మాత్రమే చికిత్స అందించేలా వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల (ఇక్కడ వైరాలజీ ల్యాబ్ కూడా ఉంది), నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల, విశాఖపట్నంలోని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్), తిరుపతిలోని ఎస్వీఎంసీ (రుయా)లను పూర్తిగా కరోనా వైద్యానికే కేటాయించాలని నిర్ణయించింది. కరోనా కేసులకు మాత్రమే ఈ ఆసుపత్రులను వినియోగిస్తే సాధారణ రోగులకు ఈ వైరస్ సోకదని భావిస్తోంది. సాధారణ రోగులకు ప్రత్యామ్నాయాలు - సిద్ధార్థ వైద్య కళాశాలకు వచ్చే రోగులు గుంటూరులోని సర్వజనాసుపత్రికి వెళ్లాలి. - నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చే వారు నారాయణ మెడికల్ కాలేజీకి వెళ్లాలి. - విశాఖ విమ్స్‌కు వెళ్లే రోగులందరూ కింగ్ జార్జి ఆస్పత్రికి వెళ్లాలి. - తిరుపతిలోని రుయాకు వచ్చే రోగులు ఇకపై పద్మావతి మెడికల్ కాలేజీ పరిధిలోని స్విమ్స్‌కు వెళ్లాలి. - ఈ నాలుగు కాలేజీల్లో కరోనా వైద్యానికి 4 వేలకు పైగా పడకలు గురువారం నాటికి అందుబాటులోకి రానున్నాయి. - కరోనా చికిత్సకు ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ఇతరత్రా ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, అత్యవసర సేవల నిలిపివేత. 24 గంటలు అందుబాటులో వైద్యులు కరోనాపై ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధమయ్యాం. వైద్యులు పూర్తి స్థాయిలో 24 గంటలు అందుబాటులో ఉంటారు. కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వారికి మెరుగైన వైద్యం అందించి కోలుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తాం. – డాక్టర్ పోతురాజు నాంచారయ్య, సూపరింటెండెంట్, విజయవాడ ప్రభుత్వాస్పత్రి -
నయా బాస్ ఆగయా !
సాక్షి, గుంటూరు : గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఎవరు వస్తారనేదానిపై రెండు నెలలుగా వైద్యుల్లో, సిబ్బందిలో నెలకొన్న ఉత్కంఠకు గురువారం తెరపడింది. అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ టీబీ, ఛాతి వ్యాధుల వైద్య విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.బాబులాల్‌కు అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం జీవో విడుదల చేశారు. గత ప్రభుత్వం తొక్కిపెట్టిన పదోన్నతులు... సీనియార్టీ ప్రాతిపదికన వైద్యులకు పదోన్నతులు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం తొక్కిపెట్టింది. టీడీపీ ప్రభుత్వంలో అడ్డదారిలో జూనియర్ వైద్యులను టీచింగ్ ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగా నియమించారు. దాంతోపాటు ప్రభుత్వ వైద్య కళాశాలలకు సైతం జూనియర్లనే నియమించారు. ఉన్నతమైన పదవులకు సీనియార్టీకి ప్రాధాన్యం ఇవ్వకుండా నిబంధనలను తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కొందరు సీనియర్ వైద్యులు కోర్టుకు సైతం వెళ్లారు. దీంతో గత ఏడాది మే నెలలో సీనియార్టీ ప్రాతిపదికన సూపరింటెండెంట్ పోస్టులు భర్తీ చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ ఏడాదిపాటు టీడీపీ ప్రభుత్వం తాము ఇచ్చిన జీవో అమలు చేయలేదు. ఈ విషయంపై పలువురు వైద్యులు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకుని సీనియార్టీ ప్రాతిపదికన పదోన్నతులు ఇవ్వాలంటూ మొరపెట్టుకున్నారు. దీంతో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తూ డీపీసీ (డిపార్ట్మెంటల్ ప్రమోషనల్ కమిటీ) ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో డీఎంఈ, అడిషనల్ డీఎంఈ కేడర్లను భర్తీ చేసేందుకు నూతన ప్రభుత్వం జూలై 1న జీవో విడుదల చేసింది. జీవో ప్రకారం గురువారం వైద్యులకు పదోన్నతులు కల్పించారు. అడ్డదారిలో అందలం... గత ప్రభుత్వంలో అడ్డదారిలో అందలమెక్కిన సూపరింటెండెంట్లు రోజూ రెండు నెలలుగా కార్యాలయ ఉద్యోగుల వద్ద ఇదే తమ చివరి సంతకం అంటూ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారు. పలువురు వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్షలు నిర్వహించే సమయంలో సైతం ఇదే తమ చివరి సమావేశమని నూతన సూపరింటెండెంట్లు వస్తున్నారంటూ చెబుతున్నారంటూ చెప్పుకొచ్చారు. రెండు నెలలుగా కొత్త సూపరింటెండెంట్లు ఎప్పుడు వస్తారంటూ ఎదురు చూపులు చూసిన వైద్యులు, వైద్య సిబ్బందికి ఉత్కంఠతకు గురువారం తెరపడింది. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రాజునాయుడు నాలుగేళ్ళపాటు సూపరింటెండెంట్ పదవిలో కొనసాగి రికార్డు సృష్టించారు. సీనియార్టీ జాబితాలో చిట్టచివరి స్థానంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల పలుకుబడితో, బడావ్యాపార వేత్త సహకారంతో పదవీ విరమణ పెంపు జీవోను తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు విమర్శలను సైతం ఎదుర్కొన్నారు. జీజీహెచ్ రేడియోథెరఫీ విభాగాధిపతిగా డాక్టర్ రాజునాయుడు 2020 మే వరకు కొనసాగనున్నారు. రేపు విధుల్లో చేరనున్న బాబులాల్ గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎస్. బాబులాల్ శనివారం విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం అనంతపురం గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిగా ఆయన జూన్ నుంచి పనిచేస్తున్నారు. విజయవాడకు చెందిన డాక్టర్ బాబులాల్ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్‌లో 1977లో ఎంబీబీఎస్, విశాఖపట్నం ఆంధ్రా మెడికల్ కాలేజ్‌లో 1983లో ఎండి పల్మనాలజీ మెడిసిన్ చదివారు. గుంటూరు జిల్లా వినుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 1987లో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా విధుల్లో చేరి ప్రభుత్వ సర్వీస్‌లోకి ప్రవేశించారు. తదుపరి 1988 జనవరి 1న మంగళగిరిలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆస్పత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా 2000లో, ప్రొఫెసర్‌గా 2001 మే9న పదోన్నతి పొంది విశాఖపట్నం కింగ్‌జార్జి ఆస్పత్రికి బదిలీ అయ్యారు. గుంటూరు రూరల్ మండలం గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో 2002లో పనిచేసి 2004 ఫిబ్రవరిలో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌కు బదిలీ అయ్యారు. డెప్యూటీ సూపరింటెండెంట్‌గా 2006లో, సూపరింటెండెంట్‌గా 2007లో, 2010లో , సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా 2012లో పనిచేశారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్‌గా 2013 నుంచి 2015 వరకు పనిచేసి తిరిగి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి బదిలీ అయ్యారు. -
పురిటిలోనే పసిగుడ్డు మృతి.. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున పురిటిలోనే ఓ శిశువు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బాధిత బంధువులు ఆస్పత్రిపై దాడిచేశారు. డిచ్పల్లి మండలం ఇస్లాంపుర కాలనీకి చెందిన ముస్కాన్ నిండు గర్భిణి. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు డెలివరీ కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చింది. సాధారణ ప్రసవం కోసం వైద్యులు పరిశీలనలో ఉంచారు. సాయంత్రం మరోసారి సాధారణ డెలివరీ కోసం ప్రయత్నం చేశారు. గర్భిణి, శిశువు ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని వైద్యులు గుర్తించారు. రాత్రి ఒంటి గంటకు సదరు గర్భిణికి బ్లీడింగ్ కావడంతో హుటాహుటిన ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసే సరికి అప్పటికే శిశువు మృతిచెందింది. విషయం తెలుసుకున్న బాలింత బంధువులు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందని ఆగ్రహించారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్‌ను ధ్వంసం చేశారు. అత్యవసర విభాగంలోని గదులను ధ్వంసం చేశారు. కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. నలుగురు వ్యక్తులు వైద్యులను సైతం బెదిరించారని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు పేర్కొన్నారు. ఈ సంఘటనపై అధికారులు ఒకటో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడులు చేయడం అమానుషం.. ఆస్పత్రిపై దాడికి నిరసనగా వైద్యులపై దాడికి యత్నించడంతో ఆస్పత్రిలోని వైద్యులు బుధవారం నిరసనకు దిగారు. విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు, ఐఎంఏ వైద్యులు కలిసి ఆస్పత్రి ప్రవేశ మార్గం వద్ద నిరసన తెలిపారు. తక్షణమే దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఐఎంఏ అధ్యక్షురాలు కవిత రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులపై దాడులు చేయడం అమానుషమన్నారు. ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉన్నప్పటికి ఉన్న వైద్యులు భారంగా వైద్య సేవలు అందిస్తున్నారని ఇలాంటి సమయంలో దాడులు చేయడం సమంజసం కాదన్నారు. ప్రతి వైద్యుడు ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తాడని కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగడం దురదృష్టకరమన్నారు. ఆస్పత్రిపై, డాక్టర్లపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఐఎంఏ కార్యదర్శి సవిత, రాణి, వైద్యులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్‌లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్యులు మొదటిసారిగా మెదడుకు శస్త్ర చికిత్స (వైద్య పరిభాషలో క్రేనియాటమీ) చేశారు. హైదరాబాద్ మినహా ప్రభుత్వ ఆస్పత్రిలో బ్రెయిన్‌కు శస్త్ర చికిత్స జరగడం తెలంగాణలో ఇదే తొలిసారి అని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు గురువారం విలేకరులకు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన రజనీకాంత్ నవంబర్ 30న ఎల్లారెడ్డిలో బైక్‌పై వెళుతుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. క్షతగాత్రుడిని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా న్యూరో సర్జన్ డాక్టర్ కృష్ణమూర్తి పరీక్షించారు. సిటీస్కాన్ తీయగా తలకు గాయమవడంతో బ్రెయిన్‌లోకి గాలి, చిన్నచిన్న ఇసుక రాళ్లు చొచ్చుకు పోయినట్లు గుర్తించారు. తక్షణమే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. దీంతో ఈనెల 2న రజనీకాంత్‌కు ఆస్పత్రిలో వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు. కాగా, ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నాడు. మరో రెండు, మూడు రోజుల్లో ఇంటికి పంపించనున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే శస్త్ర చికిత్స ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగితే రూ.3 లక్షల వరకు ఖర్చు అయ్యేదని వైద్యులు పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్సలో మత్తు మందు వైద్యుడు గిరిధర్, డాక్టర్లు విశాల్, తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.రాములు అభినందించారు. -
మారని గుంటూరు ప్రభుత్వాస్పత్రి తీరు
-
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ ... వెనుతిరిగిన మంత్రి
అనంతపురం: ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతులపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని ఎమ్మెల్సీ గేయానంద్ స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయన దీక్షకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయనకు సంఘీభావంగా ఆయా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. అయితే దీక్ష చేస్తున్న గేయానంద్‌ను కలిసేందుకు వచ్చిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. ఆ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో గేయానంద్‌ను మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫోనులో మాట్లాడించారు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని గేయానంద్ మంత్రి కామినేనితో స్పష్టం చేశారు. దీంతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెనుదిగిరి వెళ్లిపోయారు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... స్పందించకపోవడంతో ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఆసుపత్రి ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
జీజీహెచ్ ఘటనపై మంత్రి సీరియస్
- విచారణకు ఆదేశం గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బతికున్న శిశువును చనిపోయినట్లు ధ్రువీకరించిన ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడారు. ఘటనకు కారణాలపై తక్షణమే నివేదిక పంపాలని ఆదేశించారు. కాగా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడారు. ఈ ఘటనకు కారణమైన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా జిల్లాలోని దాసరిపాలెంనకు చెందిన భవానీ(23) కాన్పు నిమిత్తం ఈ రోజు ఉదయం జీజీహెచ్ కు వచ్చింది. ఆరున్నర గంటలకు సాధారణ డెలివరీ అయింది. పురిటిలోనే బాబు చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది బాబును తండ్రికి ఇచ్చారు. దీంతో తండ్రి జగన్నాధం శిశువును సొంతూరికి తీసుకెళ్లి పూడ్చుతుండగా బాబులో కదలిక కనపడింది. కాసేపయిన తర్వాత ఏడవటం మొదలు పెట్టాడు. కాసింత ఆలస్యం చేసి ఉంటే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయేది. దీంతో జగన్నాధం కుటుంబసభ్యులు నిర్లక్ష్యానికి పాల్పడిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూపరిండెంట్ కార్యాలయం వద్ద ఉదయం నుంచి ఆందోళన చేపడుతున్నారు. -
వైద్యులో.. చంద్రశేఖరా!
♦ జనరల్ ఆస్పత్రిలో పోస్టులు ఖాళీ ♦ వేధిస్తున్న సిబ్బంది కొరత అందని వైద్యం.. ♦ రోగుల అవస్థలు.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్లుగా ఖాళీల కొరత వేధిస్తోంది. పనిచేస్తున్న వైద్యులు కూడా అందుబాటులో ఉండరు. 2008లో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు కావడంతో మెరుగైన వైద్యం అందుతుందని జిల్లావాసులు ఆశించారు. పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 2012 జనవరిలో మెడికల్ కళాశాలలోని పోస్టుల భర్తీ చేయూలని 150 జీఓ విడుదలైంది. పోస్టులు భర్తీ కాలేదు. నిజామాబాద్ అర్బన్ : జనరల్ ఆస్పత్రిని నూతనంగా నిర్మించిన ఎనిమిది అంతస్తుల భవనంలో ఏర్పాటు చేశారు. 500 పడకలు.. రోజు 650 మందికిపైగా ఔట్ పేషెంట్లు, 260 మందికిపైగా ఇన్‌పేషెంట్లు వస్తుంటారు. కళాశాల ఆస్పత్రి ప్రారంభమైన కొద్దిరోజుల్లోనే రోగుల సంఖ్య నాలుగింతలు పెరిగింది. కానీ.. వైద్యులు, వైద్య సిబ్బంది పెరగడం లేదు. 2012లో 150 జీఓ విడుదల కాగా.. నాన్ క్లీనికల్ విభాగంలో 107, క్లీనికల్ విభాగంలో 455, ప్రిన్సిపల్ విభాగంలో 50, ఆస్పత్రి సూపరింటెండెంట్ విభాగానికి 189 పోస్టులు మంజూరు చేశారు. ఈ పోస్టులు నేటికి భర్తీ కాలేదు. త రచూ ప్రజాప్రతినిధులు కళాశాల, ఆస్పత్రికి రావడం పోస్టులు భర్తీపై హామీలు ఇ వ్వడం తప్పా అమలుకు నోచుకోవడం లేదు. ఇటీవల రాష్ట్ర కేబినెట్ సమావేశం లో సుదీర్ఘంగా కొనసాగిన జిల్లా మెడికల్ కళాశాల పోస్టులపై ఉస్తేతలేదు. మహబూబ్‌నగర్ కళాశాలపై చర్చించిన మంత్రి వర్గం నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జిల్లా కళాశాలపై కనీసం చర్చించకపోవడం గమనార్హం. సిబ్బంది.. ఇబ్బంది ఇలా.. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యులను మినహాయిస్తే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. 160 మంది స్టాఫ్ నర్సులకు 76 మంది పనిచేస్తున్నారు. ఫార్మాసిస్టులు ఎనిమిది మంది ఉ న్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 110 మందికి 36 మంది అందుబాటులో ఉ న్నారు. మరోవైపు సిటీస్కాన్, ఎక్స్‌రే, ల్యాబ్, ఓపి విభాగం సిబ్బంది లేరు. వీరిని వై ద్య విధాన పరిషత్ నుంచి డిప్యూటేషన్పైకొనసాగిస్తున్నారు. అంతేకాకుండా స్టెరిలైజేషన్, ల్యాండీ, ఇతర పారామెడికల్ సర్వీస్ విభాగం, మెడికల్ రికార్డు, పరిపాలన వి భాగం సంబంధించి 189 మంది ఉద్యోగులను ఉండాల్సి ఉండగా ఏ ఒకరిని ఇంతవరకు నియమించ లేదు. ప్రిన్సిపల్ విభాగంకు చెందిన 50 పోస్టులు మంజూరు కాగా అసలే భర్తీ కాలేదు. ఇందులో సెంట్రల్ లైబ్రరీ, సెంట్రల్ ఫొటోగ్రాఫిక్, ఇతర పారామెడికల్, ఎడ్యుకేషన్ సెల్, క్లీనికల్, నాన్ క్లీనికల్ పోస్టులు భర్తీ కావల్సి ఉంది. వీటి వ ల్ల రోగులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా గర్భిణుల వార్డు, చిన్నపిల్ల లు, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్ విభాగాల్లో ఇబ్బందులు అనేకం ఉన్నాయి. సెల్ఫ్ సర్వీస్ ఆస్పత్రికి వచ్చే రోగులు వార్డు బాయ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రికి అత్యవసర సమయంలో వచ్చే బాధితులకు అత్యవసర విభాగానికి తీసుకెళ్లడం, క్లీనిక్ విభాగం తీసుకెళ్లడం, అనంతరం వార్డులలో కేటాయించేటప్పుడు రోగిని జాగ్రత్తగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. రోగులకు కట్టుకట్టడంతో సహాయకారిగా ఉంటారు. కా నీ.. జనరల్ ఆస్పత్రిలో వార్డు బాయ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో 210 మంది వార్డు బాయ్‌లు ఉండాల్సి ఉండగా 21 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో రోగులను తీసుకెళ్లడంలో రోగి బంధువులే సహాయకారిగా ఉంటున్నారు. ఎనిమిదంతస్తుల భవనం ఎక్కాలంటే రోగులతోపాటు వారి బంధువులు కూడా అవస్థలు పడుతున్నారు. గర్భిణులు, రోడ్డు ప్రమాదాల బాధితులను తీసుకెళ్లడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆపరేషన్ థియేటర్లు పైన ఉండడం, వార్డులు పైననే ఉండడంతో వచ్చి వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. రోగి బంధువులు రోగులను ఎత్తుకొని వెళ్లాల్సి వస్తోంది. ఉన్నా.. వారు రారు.. జనరల్ ఆస్పత్రికి 120 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించారు. అంతేకాకుండా సీనియర్ రెసిడెన్షియల్ వైద్యులను కూడా కేటాయించారు. వీరు ప్ర స్తుతం 86 మందిని కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 36 మంది ప్రొఫెసర్లు మాత్ర మే పనిచేస్తున్నారు. సీనియర్ రెసిడెన్షియల్ కు సంబంధించి 42 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చాలా మంది ప్రొఫెసర్లు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తూ పలుసార్లు గైర్హాజరవుతున్నారు. కొందరు ప్రొఫెసర్లు మాత్రం నెలల తరబడి ఆస్పత్రికి రావడం లే దు. గతంలో ఆస్పత్రి ఇన్చార్జి బాధ్యతలు చే పట్టిన ప్రొఫెసర్ ఒకరు నెలల తరబడి రావ డం లేదు. ఎంసీఐ వచ్చి వెళ్తున్నప్పుడు వస్తున్నారు. వీరి సంతకాలను తమ రిజిస్టరులో సంతకాలను ఫోర్జరీ చేస్తున్నారు. ఒకరి సంత కం ఒకరు పెట్టడం వచ్చిన తరువాత ఒకేసారి సంతకాలు చేయడం కొనసాగుతోంది. నెలకు రూ.లక్షలు తీసుకుం టున్న ప్రొఫెసర్లు ఇలా గైర్హాజరవుతూ ఉన్నారు. -
ఈ ప్రపంచాన్ని మార్చేయండి లేదా...
ఈ ఛిద్రాన్ని (చిత్రాన్ని) చూడలేకపోతున్నారు కదూ! ఇలాంటి ఫొటో పెట్టి మీ మనసుకు బాధ కలిగించాం కదూ! క్షమించమని అడగం. అంతగా చూడలేకపోతే పేజీ తిప్పేయండి. ఇంకో బిడ్డ ఇలా చనిపోతే పోనీయండి. మనింట్లో బిడ్డ బాగానే ఉన్నాడుగా! ఎమ్మెల్యేగారింట్లో బిడ్డ కూడా బాగానే ఉండివుంటాడు! మంత్రిగారి బిడ్డయితే... పట్టుపాన్పు మీద పవళించి ఉంటాడు. ఇక ముఖ్యమంత్రిగారి మనవడా... ఆ గారాలపట్టికి సింగపూర్ సౌఖ్యాలు అందే ఉంటాయి. ‘ఎవరెట్లా పోతే మనకేం’ అనుకుంటే చాలా సింపుల్. పేజీ తిప్పేయండి. ఈ రాక్షస, దౌర్జన్య జ్ఞాపకాన్ని తొందరగా చెరిపేయండి. ముఖం తిప్పేయండి. లేదా... పోరాడండి... మరో బిడ్డకు ఇలా జరక్కుండా మరో తల్లి కన్నీరు పెట్టకుండా మరో తండ్రి నిస్సహాయంగా కూలిపోకుండా మరోసారి మనం పేజీ తిప్పేయకుండా పోరాడండి. మనం వేసిన ఓటుకు, వాళ్లు వేసిన వేటుకు సంజాయిషీ అడగండి. ఈ పసిప్రాణానికి నిజమైన నివాళి... ఈ పందికొక్కులను నిలదీయడం... ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా నినదించడం! ప్రభుత్వ అధికారుల పిల్లలు వర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని అలహాబాద్ హైకోర్టు ఇటీవల సంచలనమైన తీర్పు ఇచ్చింది. అలాగే మన ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు... గవర్నమెంట్ హాస్పిటల్లోనే చికిత్స చేయించుకోవాలనే డిమాండ్ చేయండి. లేదా, ఆ బిడ్డ తల్లి ఆక్రోశించినట్టుగా గుణపాఠం చెప్పండి... మృత్యు ఘడియలు ఒకసారి చేస్తే తప్పు అవుతుంది. తప్పు వ్యవస్థీకృతం అయితే నేరం అవుతుంది. నేరం కొనసాగుతూ ఉంటే అది దారుణం అవుతుంది. దారుణాన్ని నిర్లక్ష్యం చేస్తే ఘోరం జరుగుతుంది. ఘోరం జరిగినప్పుడు ప్రపంచం నివ్వెరపోతుంది. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అదే జరిగింది. సహాయం అడిగినప్పుడు ఒక చేయి అందించాలి. కానీ నిస్సహాయతతో అలమటిస్తున్నప్పుడు వేయి చేతులు అందించాలి. అనారోగ్యంతో ఉన్న పసికందును పొత్తిళ్లలో చుట్టుకుని తల్లీ తండ్రీ వస్తే, బిడ్డకు వచ్చిన కష్టానికి తల్లడిల్లుతూ ఉంటే, ఖరీదైన వైద్యానికి వెళ్లే స్తోమత లేకుండా ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తే... ఎన్ని చేతులు అందించాలి? ‘బిడ్డను బతికించండి బాబూ’ అని చేతుల్లో పెడితే ఎలుకలకు పడేశారు. విజయవాడ కృష్ణలంకలో నివసిస్తున్న చావలి నాగ చిరుద్యోగి. బట్టల షాపులో గుమాస్తా. భార్య లక్ష్మి రెండో కాన్పుకు సిద్ధమైంది. ఆగస్టు 17న మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టుకతోనే అసాధారణ శారీకర సమస్య (కన్జెనిటల్ ఎనామలీ) బాబులో కనిపించింది. వైద్యులు చూసి శస్త్ర చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. అదొక నరకమనీ, యమభటులు అక్కడ ఎలుకల రూపంలో తిరుగుతుంటారనీ తెలియని ఆ అమాయక తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో బిడ్డను తీసుకుని వచ్చారు. మొన్న ఆగస్టు 19న ఆపరేషన్ జరిగింది. ఐసియూలో వెంటిలేటర్ మీద ఉంచారు. బాలింతరాలైన తల్లి కూడా అక్కడే ఉంది. ఐసియూ అంటే ఇరవై నాలుగ్గంటలూ సిబ్బంది పర్యవేక్షణలో ఉండే అత్యవసర చికిత్సా గది. డ్యూటీ డాక్టర్లు, నర్సులు, ఆయాలు తిరుగుతూనే ఉండాలి. కానీ ఆగస్టు 23న బాబు కాలి వేళ్ల నుంచి, చేతి వేళ్ల నుంచి రక్తం కారుతూ కనిపించింది. ఎలుకలు కొరికాయి. తల్లి గమనించి ఫిర్యాదు చేస్తే... ఆ రోజుల పసిగుడ్డు ఎలుక కాటు వల్ల ఎంత బాధ పడి ఉంటాడో ఎంత నొప్పిని అనుభవించాడో అన్న కనీస స్పందన లేకుండా డాక్టర్లు నిర్లక్ష్యం చేశారు. ‘నీ పెద్దబాబు బాగానే ఉన్నాడు కదా... ఈ బాబు మీద ఆశ వదులుకోండి’ అని డాక్టర్లు, నర్సులు నిర్దాక్షిణ్యంగా మాట్లాడారు. ఎలుక కొరికిన వేళ్లకు వైద్యం కూడా చేయలేదు. కళ్లు, ముక్కు, చెవులు ఉండటం వల్ల మాత్రమే వీళ్లు మనుషులు. కానీ మానవత్వం లేని రాక్షసులు. పులులే కాదు ఎలుకలు కూడా రక్తాన్ని రుచి మరుగుతాయి. కాపలా లేదని గ్రహించి పసికందును కబళించడానికి సిద్ధమయ్యాయి. ఆగస్టు 26 తెల్లవారుజామున గుట్టు చప్పుడు కాకుండా బాబు కండను పీక్కు తినడం మొదలెట్టాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది లేరు. కాపాడటానికి వైద్యులు లేరు. గమనించడానికి ఎవరూ లేరు. కానీ తల్లి పేగు కదిలింది. బిడ్డకు ఏదో అపకారం జరుగుతున్నట్టు గ్రహించింది. బాలింతరాలైనా కదల్లేని స్థితిలో ఉన్నా కళ్లు తెరిచి చూస్తే కన్నబిడ్డ రక్తపు గడ్డగా కనిపించాడు. గుండె పగిలింది. శక్తి తెచ్చుకుని వాటిని తానున్న మంచం నుంచి అదిలించడానికి ప్రయత్నించింది. అరిచింది. కేకలు పెట్టింది. కానీ ఈలోపే అంతా జరిగిపోయింది. నాలుగ్గంటలు ఎలుకల దాడి జరిగింది. ఉదయం పదకొండు వరకూ డాక్టర్లు రాలేదు. వచ్చింది కూడా వైద్యం చేయడానికో, జరిగిన ఘోరానికి విచారించడానికో కాదు. బాబు మరణాన్ని నిర్లిప్తంగా ప్రకటించడానికి. వైద్యులను దేవుళ్లతో పోలుస్తారు. కానీ ఈ వైద్యులను ఎవరితో పోల్చాలి. తల్లి... బిడ్డకు జన్మను వాగ్దానం చేయాలి. వైద్యుడు... రోగికి స్వస్థతను వాగ్దానం చేయాలి. పాలకుడు ప్రజలకు సుపరిపాలనను వాగ్దానం చేయాలి. మనిషి సాటి మనిషికి సహాయాన్ని వాగ్దానం చేయాలి. ఇక్కడ తల్లి తప్ప తక్కిన అందరూ వాగ్దాన భంగం చేశారు. ‘పసిగుడ్డు పోయాడులే’ అనుకోవడానికి లేదు. దాడి చేస్తున్న ఎలుకల బాధకు ఆ పసివాడు లోలోపల చేసిన ఆర్తనాదాలు వృథా పోవు. అవి ప్రకృతిలో కలిసి, ఈ వ్యవస్థను దహించడానికి సిద్ధమైతే... అందుకు జవాబుదారీ ఎవరు? ఎలుకలూ... వ్యాధులూ ఆస్తమాలు - అలర్జీలు : ఎలుకల వల్ల ఎన్నో రకాల అలర్జీలు వస్తాయి. వాటి చర్మం, వెంట్రుకలు, విసర్జకాలు, చివరకు దానిపై నుంచి వచ్చే గాలి కూడా చాలా మందికి అలర్జీని కలిగిస్తుంది. ఆస్తమాకు కారణమవుతుంది. ఆ గాలి పీల్చిన మరుక్షణం చాలామందిలో ఉబ్బసం మొదలవుతుంది. ఇక అలర్జీ వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, కళ్లు మంటలు లాంటి అనే దుష్పరిణామాలు ఎదురవుతాయి. ప్లేగు : ఇది ఎలుకల నుంచి వ్యాపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్లేగును కలగజేసే బ్యాక్టీరియాను ఎలుకలు వ్యాప్తి చేస్తాయి. ప్లేగులో ముఖ్యంగా మూడు రకాలు ఉన్నాయి. లింఫ్ గ్రంథులు ప్రభావితమయ్యే జ్వరాన్ని బ్యూబోనిక్ ప్లేగ్ అంటారు. నిమోనిక్ ప్లేగ్ అనే ఇంకో రకం ప్లేగులో బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో పెరుగుతుంది. ఇక సెప్టిసీమిక్ ప్లేగ్ అనే మరోరకం ప్లేగు కూడా భయంకరమైనదే. ప్లేగు వ్యాధి గతంలో ఊళ్లకు ఊళ్లనే తుడిచిపెట్టేది. దీని వల్ల కలిగే మరణాలను ‘బ్లాక్ డెత్’ అని కూడా కూడా అనేవారు. లెప్టోస్పైరోసిస్ : సాధారణ ఎలుకలతో ఇది వ్యాపిస్తుంది. ఎలుకల మూత్రంతో మనం తినే ఆహారం కలుషితమైనప్పుడు ఇది వస్తుంది. ఈ జబ్బు... తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. కాలేయం పూర్తిగా చెడిపోవచ్చు. గుండెజబ్బులకూ దారితీయవచ్చు. లింఫోసైటిక్ కోరియోమెనింజైటిస్: సంక్షిప్తంగా ఎల్సీఎమ్వీ అని పిలిచే ఈ వైరస్ ఎలుకల ద్వారానే వ్యాపిస్తుంది. ఇది మెదడు చుట్టూ ఉండే పొరలకూ, వెన్నుపాముకూ ఇన్ఫెక్షన్ వచ్చేలా చేస్తుంది. కొందరిలో దీని వల్ల దీర్ఘకాలిక దుష్ర్పయోజనాలు కనిపిస్తాయి. లాసా ఫీవర్ : మల్టీ మామత్ ర్యాట్ అనే రకం ఎలుక నుంచి వస్తుందీ జబ్బు. ఎలుకల నుంచి వాసనతో పాటు వాటి విసర్జకాల నుంచి వస్తుంది. అది కరవడం వల్ల కూడా వస్తుంది. ఒకరికి వస్తే వారి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. హీమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్: పొలాల్లో తిరిగే ఫీల్డ్ మౌస్, నార్వే ర్యాట్ వంటి ఎలుకలతో ఇది వ్యాపిస్తుంది. తూర్పు ఆసియా దేశాల్లో కనిపించే ఈ వ్యాధి ఎలుకల విసర్జకాలతో వస్తుంటుంది. కొరియా, స్కాండనేవియా, యూరప్‌లలోనూ ఇది కనిపిస్తుంది. ఎలుకల మలమూత్రాల మీది నుంచి వచ్చే గాలిని పీల్చినా, వాటిని తాకినా వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి నుంచి మరో వ్యక్తికీ ఇది రావచ్చు. హంటా వైరస్... : ఇది ఎలుకల వల్ల మొత్తం అమెరికా ఖండమంతా వ్యాపించి వణికించే వ్యాధి. డీర్మౌస్, రైస్ ర్యాట్స్, వైట్ఫుటెడ్ మౌస్ వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఎలుకల మలమూత్రాలతో గాలి కాలుష్యం కావడం, దాన్ని మనుషులు పీల్చడం వల్ల ఇది వస్తుంది. కొన్నిసార్లు ఆ మూలమూత్రాలను తెలియకుండా తాకడం వల్ల కూడా వస్తుంది. ఎలుక కాటు వల్ల అయ్యే గాయం వల్ల కూడా వస్తుంది. ర్యాట్ బైట్ ఫీవర్: ఎలుక కరవడం వల్ల వచ్చే తీవ్రమైన జ్వరం. కేవలం కరవడం మాత్రమే గాక... చచ్చిన ఎలుకను ముట్టుకున్నా కూడా ఈ తీవ్రమైన జ్వరం వస్తుంది. పైన పేర్కొన్న కొన్ని మాత్రమే గాక... పరోక్షంగా సాల్మొనెల్లా, టేప్‌వార్మ్, కొన్ని రకాల కడుపు ఇన్ఫెక్షన్స్ (గ్యాస్ట్రో ఎంటిరైటిస్)లకు ఎలుకలు కారణమవుతుంటాయి. ఐసీయూ ఎలా ఉండాలంటే..! - ఐసీయూలోకి తీసుకొచ్చిన రోగుల పట్ల అక్కడి సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటారు. - రోగిని తీసుకురాగానే అతడి కీలకమైన అంశాలను పరిశీలిస్తారు. అంటే శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందనలు, నాడీ స్పందనలు, బ్లడ్‌ప్రెషర్ మొదలైనవి. అవి కీలకం కాబట్టే ఐసీయూ/వైద్య పరిభాషలో వాటిని ‘వైటల్స్’ (అత్యంత ప్రధానమైనవి) అని పిలుస్తారు. - ఒకవేళ వైటల్స్ మారిపోతూ ఉంటే, అనుక్షణం వాటి కొలతలను పరిశీలించే యంత్రాలను అమర్చి, ప్రతి క్షణం వాటి తీరుతెన్నులను పరిశీలిస్తారు. - ఇంటెన్సివిస్ట్, అనస్థీషియా నిపుణుల వంటివారు ముందుగా రోగిని చూస్తారు. అవసరమైన నిపుణులు వెంటనే వస్తారు. ఒకవేళ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉంటే ఆ యా విభాగాల వైద్య నిపుణులు అంతా ఒక బృందంగా (టీమ్‌వర్క్) ఏర్పడి, ఒకేసారి రోగికి సేవలు అందిస్తారు. - రోగిని పరిశీలించే సమయంలో ఇన్ఫెక్షన్స్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన పారిశుద్ధ్య చర్యలు అంటే ఆల్కహాలిక్ హ్యాండ్ వాష్‌లు వాడటం, రోగికి వాడిన వెంటనే పారేయాల్సిన వస్తువులు (డిస్పోజబుల్స్), పదునుగా ఉండే వస్తువులు వెంటనే అక్కడి నుంచి సురక్షితమైన చోట పడేస్తుంటారు. వాటిని ఎప్పటికప్పుడు ఆసుపత్రుల హౌజ్‌కీపింగ్ సిబ్బంది శుభ్రం చేస్తూ ఉంటారు. - విషమంగా ఉండే రోగి పరిస్థితి నిలకడకు వచ్చే వరకూ ఐసీయూలోనే ఉంటారు. అక్కడ ప్రతి రోగి వెంట ఒక వైద్య సహాయకుడు ఉంటారు. వాళ్లు లేదా డాక్టర్లు డ్యూటీ మారాల్సి వచ్చినా, తర్వాత వచ్చే సిబ్బందికి రోగి పరిస్థితి క్షుణ్ణంగా తెలిసేలా వివరిస్తారు. ఐసీయూలోని ప్రతి రోగి గురించీ... అక్కడి సిబ్బందికి పూర్తి అవగాహన ఉంటుంది. - సాధారణంగా రోగి ఆ యా వైద్య పరీక్షల కోసం నిర్దిష్టమైన ప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఐసీయూలో రోగి పరిస్థితిని బట్టి మొబైల్ ఎక్స్‌రే వంటి పరీక్ష ఉపకరణాలను రోగి దగ్గరికి తీసుకొచ్చి, అతడు ఉన్న చోటే పరీక్షలు నిర్వహిస్తారు. - రోగిలో వచ్చే మార్పులను వెంటవెంటనే నమోదు చేస్తారు. రాబోయే మార్పులను ముందుగా ఊహిస్తే... వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమవుతారు. ఎలుకలు... దాని పిల్లలు... ఎలుకల్లో అనేక రకాలు ఉంటాయి. దాని గర్భధారణ వ్యవధి, పెట్టే పిల్లల సంఖ్య... అది ఏ రకానికి చెందిదన్న అంశంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు చిన్నగా కనిపించే చిట్టెలుకల గర్భధారణ వ్యవధి (జెస్టేషన్ పీరియడ్) 17-21 రోజులు ఉంటుంది. ఇక కాస్త పెద్దగా కనిపించే ఎలుకల గర్భధారణ వ్యవధి 19-22 రోజులు ఉంటుంది. సగటున ఒక ఎలుక ఎనిమిది నుంచి పన్నెండు పిల్లలను పెడుతుంది. ఇలా ప్రతిసారి పిల్లల్ని పెట్టినప్పుడు కొన్ని వారాల పాటు తల్లి ఎలుక పిల్లలను సంరక్షిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఒక సీజన్ అంటూ లేకుండా ఏడాదంతా ఎలుకలు పిల్లల్ని పెడుతూనే ఉంటాయి. ‘మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్‌కు పంపండి!’ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న అధ్వాన్న పరిస్థితులు మెరుగు పడాలంటే ప్రభుత్వ విధుల్లో ఉన్న వారంతా తమ పిల్లల ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేయించాలని అలహాబాద్ (ఉత్తరప్రదేశ్) హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు కావలసిన ఏర్పాట్లు చేయమని రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల పని తీరు మీద, టీచర్ల నియామకాల మీద ఉమేశ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి వేసిన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మొన్నటి ఆగస్టు 18న ఈ తీర్పు వెలువరించింది. ప్రభుత్వం ద్వారా జీతభత్యాలు అందుకుంటున్న వారందరూ ఈ ఆదేశాలను పాటించాలనీ, లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకునే వీలును కూడా పరిశీలించాలని కోరింది. ప్రయివేటు పాఠశాలల్లోనే చదివించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తే గనక ఆ స్కూళ్లకు ఎంత ఫీజు చెల్లిస్తున్నారో అంత ఫీజు అక్కడి ప్రభుత్వ బడి కోసం జరిమానాగా కట్టాలని కూడా పేర్కొంది. ఇలా చేస్తే తప్ప ప్రభుత్వ బడులు బాగుపడవని న్యాయమూర్తి ఈ విలక్షణమైన వ్యాఖ్య చేశారు. ఎలుకలు కొరికే వైద్యం మొన్న పధ్నాలుగో తేదీని ఇంటి దగ్గర జారి పడ్డాను. కుడిచేయి విరిగింది. ట్రీట్మెంట్ కోసం గుంటూరు జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కి వచ్చాను. ఎముకల వార్డ్‌లో చేరాను. శుక్రవారం(18వ తేదీ) రాత్రి నిద్రలో ఉన్నాను. విరిగిన కుడిచేతిని ఏదో కొరుకుతున్నట్టు అనిపించ డంతో మెలకువ వచ్చింది. లేచి చూసుకుంటే రక్తం కారుతోంది. అక్కడే రెండు మూడు ఎలుకలు తిరుగుతూ కనిపించాయి. కంగారుపడి వార్డులో డ్యూటీ చేస్తున్నవాళ్లకు చెప్పాను. వెంటనే క్యాజువాలిటీకి తీసుకెళ్ళి ఇంజెక్షన్లు చేయించారు. తెల్లవారి డాక్టర్లు వచ్చి గాయాన్ని చూశారు. మొన్న ఆ బిడ్డ వంతు... ఇప్పుడు నా వంతు. - రాయపాటి ఏసమ్మ, దుర్గి గ్రామం, గుంటూరు జిల్లా గతంలో ఏం చేశారు? ఇదివరకైతే జీజీహెచ్ శానిటేషన్‌పై రోజూ ప్రత్యేక దృష్టి పెట్టేవాళ్ళం. వారంలో ఒకసారి అన్ని డిపార్ట్మెంట్లనూ పరిశీలించి క్రిమికీటకాలు, జంతుజాలం లోనికి రాకుండా నివారణ చర్యలు తీసుకునేవాళ్ళం. ఎలుకల నివారణ కోసం తరచూ తనిఖీలు చేసి గుంతలు పూడ్చేయించేవాళ్లం. ఎలుకల నివారణ కోసం మందుతోపాటు ఎలుకల బోనులు పెట్టే వాళ్ళం. ఎన్ఐసీయూ, ఆర్థో పెడిక్, కాన్పుల విభాగం, తదితర విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, శుభ్రంగా ఉండేలా చూసేవాళ్ళం. ఓపీ, ఐపీ విభాగాలకీ, మిలీనియం బ్లాక్‌ల శానిటేషన్ పర్యవేక్షణకీ డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ యాస్మిన్, డాక్టర్ రామ్కోటిరెడ్డిని నియమించాం కూడా! - డా.ద్రోణంరాజు ఫణిభూషణ్, జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ఆ తరువాత ఏం జరిగింది? జీజీహెచ్‌లో ఎలుకల నిర్మూలన కోసం గుంతలను సిమెంటుతో పూడ్పించాం. అలాగే రైల్వేస్టేషన్, ఆసుపత్రి బయట పరిసరాల నుంచి ఎలుకలు లోపలకి రాకుండా ఆసుపత్రి ప్రహరీ గోడ చుట్టూ ఉన్న గుంతలనూ పూడ్పించాం. అన్ని వార్డుల్లో బోనులు, మెష్‌లు ఏర్పాటు చేయించాం. పశుసంవర్ధక శాఖ, వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి సూచనలు, సలహాలతో ఎలుకల నివారణ చర్యలు చేపట్టాం. తనిఖీలు నిర్వహించి, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. - డాక్టర్ చల్లా మోహన్‌రావు, జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ఇప్పుడేం చేస్తున్నారు? ముప్ఫై మంది జిల్లా అధికారులతో టాస్క్‌ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయించాం. వీరు బుధవారం నుంచి 72 గంటల పాటు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైైవ్ నిర్వహిస్తారు. జీజీహెచ్ పారిశుద్ధ్యం మెరుగుపడేలా చూస్తారు. ఒక్కో ఉన్నతాధికారి ఒక్కో వార్డుకు ఇన్చార్జిగా ఉండి, ఎలుకల నిర్మూలనతోపాటు ఇతర జంతుజాలం లోపలకి రాకుండా చూస్తారు. క్రిమి కీటకాల నివారణకూ చర్యలు చేపడతారు. - డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ ధనార్జనే ధ్యేయంగా... అత్యవసర పరిస్థితుల్లో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వస్తే ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. పేదల కోసం కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసిన ఆసుపత్రి కేవలం వైద్యుల వ్యాపారాలకు అనుకూలంగా మారింది. ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులు నగరంలో ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసుకుని ఎక్కువ సమయం ప్రైవేటు ఆసుపత్రుల్లోనే విధులు నిర్వహిస్తూ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న పేదలను మరిచిపోతున్నారు. ధనార్జనే ధ్యేయమైంది. సిబ్బంది, వైద్యులు పట్టించుకోవట్లేదని ఎందరో అభాగ్యులు ఫిర్యాదులు చేసినా ఇంతవరకు అధికారులు స్పందించకపోవడం శోచనీయం. - జొన్నలగడ్డ వెంకట రత్నం, ప్రజాహక్కుల జేఏసీ అధ్యక్షుడు వందల కోట్ల బడ్జెట్ ఏమైపోతోంది? ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువసేపు గడుపుతూ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు న్యాయం చేయలేకపోతున్నారు వైద్యులు. ఏటా వందల కోట్లతో వైద్యారోగ్యశాఖ పేదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆ నిధులు పేదలకు చేరకపోవడానికి కారణమేమిటో అధికారులు ఆలోచించడం లేదు. ఆ వందల కోట్ల బడ్జెట్లు ఏమవుతున్నాయి? రోగుల సౌకర్యాలను ఎందుకు పట్టించుకోవడం లేదు? కుక్కలు, పాములు, ఎలుకల లాంటి ప్రమాదకరమైన ప్రాణుల నుంచి రోగులను ఎందుకని కాపాడలేకపోతున్నారు? ప్రభుత్వం స్పందించి, పటిష్ఠమైన భద్రతాచర్యలు తీసుకోవాలి. - డాక్టర్ టి.సేవాకుమార్, ఎస్‌హెచ్‌వో అధ్యక్షుడు -
నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు!
-
ఆరేళ్ల అలసత్వం
వైద్యులు లేరు.. రోగులు రారు.. ఉద్యోగులకు మాత్రం ప్రతినెలా జీతాలు పని లేకుండానే శిథిల భవనాల్లో 84 మంది కాలక్షేపం మంగళగిరి ప్రభుత్వాస్పత్రిలో విచిత్రం సాక్షి, విజయవాడ బ్యూరో : అది ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి. కానీ అందులో ఒక్క వైద్యుడు కూడా లేడు. రోగులు వచ్చే పరిస్థితి లేనే లేదు. అయినా 84 మంది ఉద్యోగులు మాత్రం అక్కడ పనిచేస్తున్నారు. అది కూడా ఆరేళ్లుగా. ప్రతి నెలా వీరికి జీతాలు పంపుతున్న వైద్యవిద్య శాఖ ఉన్నతాధికారులు మాత్రం ఈ విషయం గురించి పట్టించుకోలేదు. ఉద్యోగులు పనిదినాల్లో కాలక్షేపానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ విడ్డూరం మంగళగిరి ప్రభుత్వాస్పత్రిలో ఆరేళ్లుగా నిరాఘాటంగా జరుగుతోంది. స్టే ఆర్డర్‌తో నిలిచిన బదిలీలు మంగళగిరికి రెండు పక్కలా ఉన్న గుంటూరు, విజయవాడ ప్రభుత్వాస్పత్రులు నిరంతరం రోగులతో కిటకిటలాడుతున్నా అక్కడ అవసరమైన నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది లేరు. మంగళగిరి ప్రభుత్వాస్పత్రికి రోగులెవరూ రాకపోయినా 84 మంది ఉద్యోగం చేస్తున్నారు. ఖాళీగా ఉన్న వారిని ఈ రెండు ఆస్పత్రుల్లో సర్దుబాటు చేయాలని గతంలో అధికారులు ప్రయత్నించినా సాధ్యపడలేదు. కొందరు ఉద్యోగుల సహకారంతో స్థానికులు కోర్టుకెళ్లి ఆస్పత్రిని వేరే ప్రాంతానికి మార్చకుండా స్టే ఆర్డర్ తెచ్చారు. దీన్ని ఎత్తివేయించడానికి ఉన్నతాధికారులెవరూ ప్రయత్నించకపోవడంతో ఉద్యోగులు ఆరేళ్ల నుంచి పని లేకుండా జీతాలు తీసుకుని గడిపేస్తుండడం విశేషం. అసలు కథ ఇదీ మంగళగిరిలో 50 ఏళ్ల కిందట కుష్టు రోగుల కోసం టీబీ శానిటోరియాన్ని ఏర్పాటు చేశారు. 1987లో దీన్ని 180 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిగా మార్చారు. అప్పట్లో 2,247 మంది ఇన్‌పేషెంట్లు, 45,436 మంది అవుట్‌పేషెంట్లు ఇక్కడ చికిత్స పొందారు. 2004 సంవత్సరానికి ఈ ఆస్పత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య లక్షా 64 వేలకుపైగా పెరిగింది. పట్టణంలో వైద్య సదుపాయాలు పెరగడం, ఊరికి దూరంగా ఉండడంతో రోగుల సంఖ్య క్రమేపీ తగ్గింది. ఈ నేపథ్యంలో 2008లో 180 పడకల ఈ ఆస్పత్రిని ఎంసీఐ సిఫారసు మేరకు విజయవాడ సిద్ధార్ధ వైద్య కళాశాలకు అనుబంధంగా మార్చారు. అప్పుడే ఆస్పత్రిలో పనిచేస్తున్న సుమారు 30 మంది వైద్యులు కూడా విజయవాడకు వచ్చారు. కానీ స్టాఫ్‌నర్సులు, నర్సులు, ఇతర సిబ్బంది 150 మంది రాలేదు. గుంటూరు జోన్లో ఉన్న తాము రాజమండ్రి జోన్ పరిధిలోని విజయవాడ వెళితే సర్వీసు కోల్పోవాల్సివస్తుందని, తామంతా జూనియర్లమవుతామనే కారణంతో వారు అభ్యంతరం వ్యక్తం చేసి అక్కడే ఉండిపోయారు. విజయవాడ కాకపోతే గుంటూరు జిల్లాలోని గుంటూరు, పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో పనిచేయడానికీ వారు ఒప్పుకోలేదు. దీంతో ఆ సమస్య అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంది. డీఎంఈ పరిశీలనలో వెలుగులోకి.. 2008లో 150 మంది సిబ్బంది ఉండగా కొందరు రిటైర్ కావడంతో వారి సంఖ్య ప్రస్తుతం 107కి తగ్గింది. ప్రస్తుతం 84 మంది మాత్రమే ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు రికార్డుల్లో నమోదై ఉంది. ఇటీవలే 24 మంది సిబ్బందిని ఉన్నతాధికారులు బలవంతంగా గుంటూరు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి బదిలీ చేశారు. మిగిలినవారు పనీ పాటా లేకుండా అక్కడే కాలక్షేపం చేస్తున్నారు. సీఎస్ ఆర్ఎంవోగా పనిచేస్తున్న వైద్యురాలు ప్రస్తుతం ఈ ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంగణంలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో మెడికల్ ఎడ్యుకేషన్ డెరైక్టర్ శాంతారామ్ ఇటీవల అక్కడికెళ్లినప్పుడు ఆస్పత్రిని చూసి అవాక్కయ్యారు. 2008 నుంచి వైద్యులు, రోగులు లేకుండా ఆస్పత్రిని ఎలా కొనసాగిస్తున్నారో తెలియక విస్మయానికి లోనయ్యారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పసికందులు మృతి
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పసికందులు మృతి చెందారు. శుక్రవారం రాత్రి నగరంలో భారీగా వర్షం కురిసింది. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అదే సమయానికి ఆసుపత్రిలోని జనరేటర్లో కూడా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో ఆసుపత్రిలో ముగ్గురు పసికందులు మృత్యువాత పడ్డారు. దాంతో ఆసుపత్రి ఎదుట పసికందుల బంధువులు ఆందోళనకు దిగారు. -
హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్
దినేష్ ఘటనతో వెలుగు చూసిన వైనం నిందితుల కోసం ముమ్మర గాలింపు రంగంలోకి ప్రత్యేక బృందాలు దినేష్‌ది సాధారణ మరణమని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దినేష్ ఘటనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్ నడుస్తుందని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీసీఎస్ డీసీపీ పాల్రాజు తెలిపారు. కాగా కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు దినేష్ పోస్టుమార్టం నివేదికలో అతనిది సాధారణ మరణ ం (గుండెపోటు) అని వెల్లడించారు. కిడ్నీ మార్పిడి జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక ఆపరేషన్‌కు ముందే గుండెపోటు వచ్చి చనిపోయాడా అనే విషయాలు ఆ నివేదికలో డాక్టర్లు పేర్కొనలేదని పాల్రాజు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగానే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కిడ్నీ రాకెట్‌తోనే దినేష్ సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని గట్టెక్కించేందుకు కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్న దినేష్.. రెండు నెలల నుంచి వేర్వేరుగా నాలుగు కిడ్నీ రాకెట్ ముఠాలతో సంప్రదింపులు జరిపాడు. ఇందులో ఒక ముఠా బ్రోకర్ ప్రశాంత్ సేట్ తో సంప్రదించినట్లు అతని ఈ-మెయిల్ ద్వారా వెల్లడైంది. కానీ అది సంప్రదింపులకే పరిమితమైంది. దినేష్ కొలంబో వెళ్లడానికి కారణం.. మరో మూడు ముఠాలలో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న రాకెట్. ఈ ముఠా ఆదేశాల మేరకే దినేష్ కొత్తగూడెం నుంచి గత నెల 22న బయలుదేరి అదే రోజు హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ కిడ్నీ రాకెట్ ముఠాతో సంప్రదింపులు జరిపిన తరువాత అతను మరుసటిరోజు గుంటూరు వెళ్లాడు. అక్కడి నుంచి వెంకటేశ్వర్లు, కిషోర్లతో కలిసి చెన్నై వెళ్లి అక్కడి నుంచి కొలంబో వె ళ్లి మరణించాడు. అయితే హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ నిర్వాహకులు ఎవరు, వీరి మకాం ఎక్కడ అనే విషయాలపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ కేసులో అత్యంత విలువైన క్లూ లభించిందని, నిందితులను త్వరలో అరెస్టు చేసి మీడియా ముందు చూపిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన నిందితుడు..? దినేష్ మృతి, కిడ్నీ రాకెట్ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వ చ్చిన కథనాలపై గుంటూరుకు చెందిన కిషోర్ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. దినేష్‌తో పాటు గో ట్రావెల్ బస్సులో కిషోర్ కూడా వెళ్లాడు. దినేష్ సెల్‌ఫోన్ కాల్‌లిస్టులో తన నెంబర్లు కూడా ఉంటాయని గ్రహించిన కిషోర్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని లొంగిపోయినట్లు తెలిసింది. ఇతనిచ్చిన సమాచారం మేర కే పోలీసులు సూత్రధారి కోసం వేట మొదలు పెట్టినట్లు తెలిసింది. సంతకం పెట్టిన ఉన్నతాధికారి ఎవరు..? దినేష్‌కు పాస్‌పోర్టు కేవలం 15 రోజుల్లోనే సమకూర్చారు. ఇదందా కిడ్నీ రాకెట్ బ్రోకరే చేయించాడు. ఇంత త్వరగా పాస్‌పోర్టు వచ్చే విధంగా చేశాడంటే అది కేవలం తత్కాల్ కింద దరఖాస్తు చేస్తేనే సాధ్యం. కాగా ఇలాంటి దరఖాస్తుపై దినేష్‌కు ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారి సర్టిఫై చేసి ఉండాలి. ఆ అధికారికి... కిడ్నీ వ్యాపారానికి సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ అధికారి దినేష్లాంటి వారికి ఎంతమందికి సంతకాలు పెట్టి ఉంటారోనన్న దిశగానూ విచారణ సాగుతోంది. ఈ రాకెట్లో పాస్‌పోర్టు అధికారుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.