పటాన్‌చెరు: వికలాంగులందరికీ మెట్రో బస్‌పాస్‌లు ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10.45 లక్షల మంది వికలాంగులున్నారని తెలిపారు. మంగళవారం పటాన్‌చెరులోని శ్రామిక్ భవన్‌లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం వికలాంగత్వం ఉన్న వారికే పాసులు ఇస్తామని ఆర్టీసీ చెప్తుందన్నారు. 40 శాతం వికలాంగత్వం ఉన్న వారికి ఇతర ప్రభుత్వ పథకాల్లో అవకాశం లభిస్తున్నప్పటికీ మెట్రో బస్‌పాస్ సౌకర్యం దొరక్కపోవడం సరైంది కాదన్నారు. 4.45 లక్షల మంది వికలాంగులకు 41 శాతం వికలాంగత్వ ఉందన్నారు.
గతంలోనే ప్రభుత్వాలు వికలాంగులకు మెట్రో, హైటెక్ బస్సుల్లో పాస్‌లు ఇస్తామని చెప్పినా నేటికీ అది అమలుకు నోచుకోలేదన్నారు. ఈ నెల 19 నుంచి 20 వరకు అన్ని డిపోల ముందు నిరాహార దీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేస్తున్నమని తెలిపారు.
ఈ నెల 26న బస్‌బవన్‌ను ముట్టడిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆ వేదిక జిల్లా సహాయ కార్యదర్శి బి.బస్వరాజ్, డివిజన్ నాయకులు సత్యనారాయణ, రాంచందర్, గోపాల్, రాములు తదితరులు పాల్గొన్నారు.