27న ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష | si written exam on 27th | Sakshi
Sakshi News home page

27న ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష

Published Tue, Nov 22 2016 11:30 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM

si written exam on 27th

అనంతపురం సెంట్రల్‌ : పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి ఈనెల 27న రాత పరీక్ష నిర్వహిస్తున్నట్లు జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌ ప్రహ్లాదరావు తెలిపారు. జిల్లా కేంద్రంలో 20 సెంటర్లను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ పరీక్షలకు దాదాపు 10,260 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement