
‘ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవు’
సిద్ధిపేట: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి ఎస్‌ఐ సతీష్ జులుంపై పోలీసు కమిషనర్ శివకుమార్ స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకరి వాదనే వినడం సరికాదని, ఇరువైపుల వాదనలు వినాలని సూచించారు. ఒకవేళ ఎస్‌ఐ తప్పుచేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సివిల్ వివాదాల్లో పోలీసు సిబ్బంది జోక్యం చేసుకోకుండా ప్రయత్నిస్తున్నామని మిరుదొడ్డి ఘటన తన దృష్టికి వచ్చిందని తెలిపారు.
సిద్ధిపేట పోలీసు కమిషనర్‌కు నిజాయితీ ఉంటే ఎస్‌ఐ సతీష్‌ను సస్పెండ్ చేసి, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది రఘునాథ్ డిమాండ్ చేశారు. ‘దివ్యాంగుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులను బెదిరించే పరిస్థితి ఉంటుందా? కమిషనర్‌కు ఆ విషయం తెలియదా? ఇందులో విచారించడానికి ఏముంది? ఎస్ఐ సతీష్‌ను కమిషనర్ వెనకేసుకు రావడం సరికాద’ని రఘునాథ్ అన్నారు.