సింగరేణి .. వెలుగుల రాణి
- నేడు జైపూర్ విద్యుత్ ప్లాంట్ రెండో యూనిట్ సింక్రనైజేషన్
- మొదటి యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం
జైపూర్: సింగరేణి సంస్థ మరో అద్భుత ఘట్టా న్ని ఆవిష్కరించనుంది. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంటు ద్వారా ఇక నుంచి రాష్ట్రానికి విద్యుత్ వెలుగు అందనున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో నిర్మించిన బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాం టులోని మొదటి యూనిట్ బుధవారం నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ యూనిట్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయను న్నారు.రెండో యూనిట్ సింక్రనైజేషన్ ప్రక్రియ బుధవారం జరగనుంది. ఈ కార్యక్రమాలకు సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్. శ్రీధర్ శ్రీకారం చుట్టనున్నారు.
ఇక్కడి థర్మల్ పవర్‌ప్లాంటు నిర్మాణానికి 2010లో శ్రీకారం చుట్టారు. ఆరేళ్లపాటు అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగిన పనులు చివరికి తుదిదశకు చేరాయి. దీంతో విద్యుత్ ఉత్పత్తికి జైపూర్ ప్లాంటు తయారవుతోంది. యూనిట్-1 ప్లాంటులో కీలకమైన సింక్రనైజేషన్(బీటీజీ, వోవోపీ అన్ని వ్యవస్థల అనుసంధానం) ప్రక్రి య మార్చి 13న చేపట్టగా రెండో యూనిట్ ప్లాంటులో సింక్రనైజేషన్ ప్రక్రియను బుధవా రం చేపట్టనున్నారు. మొదటి యూనిట్ ప్లాం టులో ఆయిల్, బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేయ గా, బుధవారం నుంచి బొగ్గుతో నిరంతరం విద్యుదుత్పత్తి చేపట్టనున్నారు. గజ్వేల్‌లోని విద్యుత్‌గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు.