‘ఆకోలి’కి స్కోచ్‌ అవార్డ్‌ | skoch award for akoli | Sakshi
Sakshi News home page

‘ఆకోలి’కి స్కోచ్‌ అవార్డ్‌

Published Thu, Sep 8 2016 11:50 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

అవార్డు అందుకుంటున్న గజానన్‌ - Sakshi

అవార్డు అందుకుంటున్న గజానన్‌

జైనథ్‌ : దేశంలోని సామాన్య ప్రజల సామాజిక–ఆర్థిక ప్రగతికి విశేషంగా కృషి చేసిన వారికి అందించే అత్యుత్తమ స్కోచ్‌ అవార్డుకు జైనథ్‌ మండలం ఆకోలి గ్రామం ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జాతీయ ఈ సాక్షరత మిషన్‌లో భాగంగా ఆకోలి గ్రామాన్ని వంద శాతం ఈ సాక్షరత గ్రామంగా మార్చిన భోరజ్‌ మీసేవా కేంద్రం, సీఎస్సీ నిర్వాహకుడు నివల్కర్‌ గజానన్‌ అవార్డును అందుకున్నారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో నిర్వహించిన 45వ జాతీయ స్కోచ్‌ సదస్సులో సీఎస్సీ జాతీయ ఉపాధ్యక్షుడు రాజ్‌కిశోర్‌ అవార్డు అందజేశారు. గజానన్‌ సదస్సులో ప్రత్యేకంగా ఈ సాక్షరత స్టాల్స్‌ను ఏర్పాటు చేసే అరుదైన అవకాశం సైతం దక్కించుకున్నారు. ఈ స్టాల్‌లో వంద శాతం ఈ సాక్షరత గ్రామంగా ఆకోలిని మలచడానికి ఆయన చేసిన కృషి, దాని ఫలితాలను తెలిపే వీడియోలు, ఫొటోలు ప్రదర్శించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement