ఎస్కేయూ : వర్సిటీలోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ –2017 ఈ నెల 29 న ప్రారంభంమై జూన్ 2న ముగుస్తుంది. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ల కార్యాలయంలో శుక్రవారం అడ్వైజయిరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బీవీ రాఘవులు అధ్యక్షత వహించారు. సమావేశంలో రాత పరీక్షల షెడ్యూల్‌ను ఆమోదించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జే.శ్రీరాములు, ఆచార్య ఎస్ .శంకర్ నాయక్, డీఓఏ జాయింట్ డైరెక్టర్ రమణ, డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూలిలా..
29న పాలిమర్ సైన్సెస్, సెరికల్చర్, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, బోటనీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, జియాలజీ
30న కెమిస్ట్రి, సోషల్ వర్క్, మేథమేటిక్స్, సోషియాలజీ, ఫిజిక్స్, రూరల్ డెవలప్‌మెంట్, బయోకెమిస్ట్రి. 31న ఎంఈడీ, కంప్యూటర్ సైన్సెస్, ఎంపీఈడీ, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, కామర్స్ , జూన్ ఒకటిన తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ, జువాలజీ, 2న పొలిటికల్ సైన్సెస్, ఎంఎల్‌ఐఎస్సీ, హిందీ, అడల్ట్‌ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి.
29 నుంచి ఎస్కేయూసెట్
Published Fri, May 12 2017 11:09 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement