రైలు నుంచి జారి పడి.. | slip from train | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారి పడి..

Published Sat, Oct 15 2016 12:20 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

slip from train

 అనంతపురం యువకుడి మృతి
 
పాణ్యం: పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు రైలులో వెళ్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు జారి దుర్మరణం చెందాడు. ఈ ఘటన పాణ్యం మండలం నెరవాడ  రైల్వే బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన బీమ లింగప్ప కుమారుడు చైతన్య(24) నంద్యాలోని ఓ బ్యాంక్‌ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. హైదరాబాద్‌లో జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారం తెల్లవారుజామున రైలులో బయలుదేరాడు. నెర్రవాడ సమీపంలో రైలు నుంచి జారి పడటంతో తీవ్రంగా గాయపడి దుర్మరణం చెందాడు. ఘటన స్థలంలో శరీర అవయవాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ట్రాక్‌ మెన్‌ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే ఎస్‌ఐ నారాయణ, హెడ్‌ కానిస్టేబుల్‌ రఫీ, శ్రీనివాసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరశీలించారు. సమీపంలో లభించిన ఓటరు కార్డు, ఫొటో సేకరించి కుటుంబీకులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని నంద్యాల ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement