ఈదురు గాలులకు ఎగిరి పడిన సోలార్ పలకలు
గడివేముల : గని, శకునాల వద్ద నిర్మాణ దశలో ఉన్న ఆల్ట్రా మెగా సోలార్ పార్కులో ఆదివారం వీచిన పెనుగాలులకు సోలార్ పలకలు ఎగిరిపడ్డాయి. త్వరగా సోలార్ పార్కును ప్రారంభోత్సవం చేయాలనే ఆత్రుతలో పనుల్లో నాణ్యత కొరవడింది. అందువల్లే చిన్నపాటి గాలికే ప్యానల్ ప్లేట్లు ఎగిరిపోయాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్కు ప్రారంభోత్సవం కొంత నిదానమైనా నిర్మాణ పనులు నాణ్యతగా చేయిస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. పెనుగాలులకు అక్కడక్కడ ప్లేట్లు లేచాయని, దీంతో రెండు మూడు లక్షల రూపాయల వరకు నష్టం జరిగి ఉంటుందని
ఈఈ సుధాకర్ తెలిపారు.