- నేలకూలిన విద్యుత్ స్తంభాలు..కరెంట్ సరఫరా బంద్
- వేలాది ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం
కడప: పెనుగాలులతో కూడిన వర్షం వైఎస్సార్ జిల్లాను అతలాకుతలం చేసింది. బుధవారం రాత్రి 7 గంటలకు పెనుగాలులు ప్రారంభమయ్యాయి. దానికితోడు వర్షం విడవకుండా కురవడంతో పులివెందుల, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో సరఫరాను నిలిపివేశారు.
రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల నియోజకవర్గాల్లో వేలాది ఎకరాల్లో అరటి, మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. చెట్లు నేలకొరిగాయి. అకాల వర్షానికి, పెనుగాలులకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్థరాత్రి వరకూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయలేదు. అంధకారంలో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.