త్వరలో ‘డిండి’ ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు
త్వరలో ‘డిండి’ ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు
Published Sat, Jul 23 2016 11:14 PM | Last Updated on Thu, Aug 9 2018 8:41 PM
కొండమల్లేపల్లి : త్వరలో డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు టెండర్లు వేయనున్నట్లు నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శనివారం కొండమల్లేపల్లి పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు సస్యశ్యామలవుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రధానంగా జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంపొందించడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చి మొదటగా హరితహారం కార్యక్రమాన్ని నల్లగొండ జిల్లాలో ప్రారంభించారన్నారు. పిల్లలను ఏవిధంగా చూసుకుంటామో నాటిన ప్రతి మొక్కను అదేవిధంగా చూసుకోవాలని సూచించారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో దేవరకొండ జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వైస్ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, మాడ్గుల యాదగిరి, వస్కుల కాశయ్య, పస్నూరి వెంకటేశ్వర్‌రెడ్డి, అల్గుల సైదిరెడ్డి, నాగవరం రాజు, తేరా గోవర్ధన్‌రెడ్డి, శిరందాసు కృష్ణయ్య, అబ్బనబోయిన శ్రీనివాస్‌యాదవ్, దస్రూనాయక్, వెంకటయ్య, ఆప్కో సత్తయ్య తదితరులున్నారు.
Advertisement