- జిల్లా ఎస్పీ రవిప్రకాష్
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
Published Tue, Dec 13 2016 11:44 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
చింతూరు :
మావోయిస్టుల చేతిలో ఇటీవలి కాలంలో హత్యకు గురైన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేశామని, గతంలో రూ.లక్ష ఇచ్చిన కుటుంబాలకు సైతం మరో రూ.నాలుగు లక్షల చొప్పున పరిహారం అందజేసినట్లు జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. చింతూరు పోలీస్‌స్టేçÙ¯ŒSలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎంతోమంది ప్రజలు ప్రయాణించే చింతూరు మండలం సరి వెల జాతీయ రహదారిపై మావోయిస్టు లు మందుపాతర్లు అమర్చడాన్ని తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. ప్రస్తుతం విలీన మండలాల్లో శబరి ఏరియా కమిటీ కమాండర్‌గా తెలంగాణ రాష్ట్రం దుమ్ముగూడెంకు చెందిన రజిత, డిప్యూటీ కమాండర్‌గా సనీల్ వ్యవహరిస్తున్నట్లు ఆయన చెప్పారు. గంజాయి రవాణాలో పోలీసుల పాత్ర ఉండడంతో సీఐ, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని, అనుమానాలకు తావివ్వకూడదని భావించి ఏజెన్సీలోని అన్ని పోలీస్‌స్టేషన్ల కు చెందిన సిబ్బందిని బదిలీ చేశామన్నారు. డీఎస్పీ దిలీప్ కిరణ్, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.
లొంగుబాటు దంపతుల నేపధ్యమిది
చింతూరులో మంగళవారం జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఎదుట మావోయిస్టు దంపతులు వెట్టి ఉంగి అలియాస్ జ్యోతి, మడకం బండి అలియాస్ కమలేష్ దంపతులు లొంగిపోయారు. ఎటపాక మండలం, సంగంపాడు గ్రామం, గుత్తికోయ తెగకు చెందిన జ్యోతి కుటుంబ కలహాల నేపథ్యంలో 2012లో అప్పటి శబరి ఏరియా కమిటీ కార్యదర్శి ప్రోద్భలంతో అజ్ఞాతంలోకి వెళ్లింది. అప్పటి నుంచి దళ సభ్యురాలిగా వ్యవహరిస్తూ 303 రైఫిల్ కలిగివుండేది. గతంలో దళానికి కమాండర్లుగా వ్యవహరించిన నరేష్, నగేష్‌తో పాటు ప్రస్తుతం కమాండర్ రజిత ఆధ్వర్యంలో నాలుగేళ్లు దళంలో పని చేసింది. 2013లో ఛత్తీస్‌గఢ్‌లోని బడేచెల్మా, 2016లో బొట్టెం వద్ద జరిగిన ఎదురుకాల్పులు, 2014లో ధర్మపెంట, 2016లో పామేడు పోలీస్‌క్యాంపులపై దాడి, 2015 లో చింతూరు మండలం బుర్కనకోట గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తుల హత్య, 2016లో చింతూ రు మండలం పేగలో మందుపాతర అమర్చిన కేసుల్లో జ్యోతి నిందితురాలని ఎస్పీ తెలిపారు. ఎటపాక మండలం గొల్లగుప్పకు చెందిన కమలేష్ 2015లో అప్పటి శబరి ఏరియా కమిటీ కమాండర్ నగేష్ ప్రోద్భలంతో దళంలో చేరాడు. అప్పటి నుంచి 303 రైఫిల్ వినియోగిస్తూ లొంగొపోయేంత వరకు దళ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 2015లో ఎటపాక మండలం లక్ష్మీపురంనకు చెందిన చర్చి పాస్టర్ కన్నయ్య కుమారుడు ఇస్సాక్ కిడ్నాప్, 2016లో బొట్టెం ఎదురు కాల్పుల ఘటనల్లో నిందితుడని ఎస్పీ తెలిపారు.
Advertisement
Advertisement