శ్రీకాకుళం–భద్రాచలం మధ్య నాలుగు లేన్ల రోడ్డుకు సర్వే
శ్రీకాకుళం–భద్రాచలం మధ్య నాలుగు లేన్ల రోడ్డుకు సర్వే
Published Mon, Sep 26 2016 10:47 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM
అడ్డతీగల : శ్రీకాకుళం–భద్రాచలంల మధ్య అడ్డతీగల మీదుగా నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి సర్వే జరుగుతోంది. మహారాష్ట్రలోని నాగపూర్ కేంద్రంగా పనిచేసే కేఎన్‌జే అనే ఇంజినీరింగ్ సంస్థకు ఈ సర్వే బాధ్యతను నేషనల్ హైవే అధారిటీ అప్పగించింది. కేఎన్‌జే సంస్థలోని సర్వే అండ్ ప్రాసెసింగ్ విభాగం సైట్ ఇంజినీర్లు శివ, గౌరవ్‌లు మరికొంతlమంది సిబ్బందితో కలిసి అడ్డతీగలలోని వేటమామిడి వద్ద సోమవారం రోడ్డు సర్వే చేశారు. ఈ మార్గంలో ప్రస్తుతం ఉన్న కల్వర్టుల సామర్ధ్యం ఎంత? భారీ వాహనాల రాకపోకలను అవి తట్టుకుంటాయా? లేదా కొత్తవి నిర్మించాలా? అనే అంశాలను వారు పరిశీలిస్తున్నారు.అలాగే నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ఇక్కడి భూమి స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా? లేదా? ఆర్‌అండ్‌బీ స్వాధీనంలో ఏ మేరకు భూమి ఉంది? అనే అంశాలను కూడా నమోదు చేసుకుంటున్నారు. రంపచోడవరం మండలం ఐ.పోలవరం నుంచి విశాఖ జిల్లా కొయ్యూరు వరకూ తాము సర్వే పనులు చూస్తున్నామని వారు తెలిపారు. మొత్తం రోడ్డు సర్వే కోసం తమ సంస్థ తరఫున ఐదు బృందాలు నియమింపబడ్డాయని సైట్ ఇంజినీర్లు శివ, గౌరవ్ తెలిపారు. ఇక్కడ నమోదు చేసుకున్న వివరాలను శాటిలైట్ ద్వారా తమ కంపెనీకి ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తామన్నారు.
Advertisement
Advertisement