శ్రీమఠం..వైభవోత్సవం
శ్రీమఠం..వైభవోత్సవం
Published Wed, Mar 1 2017 11:37 PM | Last Updated on Tue, Sep 5 2017 4:56 AM
–రెండో రోజు ఆకట్టుకున్న వేడుకలు
మంత్రాలయం : పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థుల నేతృత్వంలో సద్గురు శ్రీ రాఘవేంద్ర స్వామి శ్రీవైభవోత్సవాలు రెండో రోజు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువ జామున సుప్రభాత సేవ, మూలబృంధావన, నిర్మల్య విసర్జన, పంచామృతాభిషేకాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి దివ్య మందిరంలో జయ, దిగ్విజయ , మూలరాములు , పూజలో తరించారు. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయలకు చెక్క, వెండి, స్వర్ణం నవరత్న రథాల పై శ్రీమఠం మాడవీధుల్లో ఊరేగించారు. యోగేంద్ర మంటపంలో ఉడిపికి చెందిన కుమార విద్య భరత నాట్య ప్రదర్శన భక్తులను అలరించింది. వేడుకలో ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌శ్రీనివాస రావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహా మూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ , ద్వారపాలక అనంత స్వామి పాల్గొన్నారు.
Advertisement
Advertisement