
56 ఏళ్ల వయస్సులో ఎస్సెస్సీ పరీక్ష
చెన్నారావుపేట(నర్సంపేట): చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ మోడల్ స్కూల్‌లో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వర్ధన్నపేట మండలం చెన్నారాం గ్రామానికి చెందిన 56 ఏళ్ల అరూరి ఎల్లయ్య పరీక్షలు రాస్తుండగా పలువురు ఆశ్చర్యానికి లోనయ్యారు. చెన్నారం హైస్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న ఎల్లయ్యకు రూ.1.600 వేతనం వస్తోంది. పదో తరగతి విద్యార్హత ఉంటే వేతనం పెరుగుతుందని తెలియడంతో పరీక్షలకు హాజరవుతున్నానని ఎల్లయ్య ఈ సందర్భంగా తెలిపారు.