ప్రారంభానికి నోచుకోని బాలికల పాలిటెక్నిక్ హాస్టల్
-
వసతి లేక విద్యార్థినుల ఇబ్బందులు
పోచమ్మమైదాన్ : అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది పాలిటñ క్నిక్ కళాశాల పరిస్థితి. బాలికల కోసం మూడేళ్ల కిత్రం నిర్మించిన హాస్టల్‌ను ప్రారంభించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టు 2న వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల హాస్టల్‌ను ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో 60 మంది విద్యార్థినులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 29 మంది రిఫండబుల్ డిపాజిట్ కోసం రూ.2 వేల చొప్పున, మెస్‌చార్జి రూ. 1500 చెల్లించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బ్యాగులతో సహా కళాశాల హాస్టల్‌కు మంగళవారం చేరుకున్నారు. హాస్టల్ గేట్‌కు తాళం ఉండే సరికి కంగుతిన్నారు. హాస్టల్ తీయలేదు అని అడిగినా సమాధానం చెప్పేవారు కరువయ్యారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాసి తిరిగి వెళ్లిపోయారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కోఎడ్యుకేషన్, పాలిటెక్నిక్ కళాశాలలో సుమారుగా 600 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థినులు పలుమార్లు అధికారులకు విన్నవించగా డిసెంబర్ 2010లో హాస్టల్‌ను మం జూరు చేశారు. సాంకేతిక విద్యా శాఖ అధికారులు హాస్టల్ నిర్మాణ బాధ్యతలను ఎస్సీ కార్పొరేషన్‌కు అప్పగించారు. రూ. కోటి నిధులతో 2011 డిసెంబర్‌లో హాస్టల్ నిర్మాణ పనులు ప్రారంభించి, అక్టోబర్ 2013లో పూ ర్తి చేశారు. ఇక అప్పటి నుంచి హాస్టల్‌ను ప్రా రంభించడం లేదు. గతంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల పక్కనే ఉన్న మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో కొంత మందికి వసతి కల్పించే వారు. ఆ కళాశాలలో మరో రెండు కోర్సులు పెంచడంతో అక్కడి విద్యార్థినులకు మాత్రమే సరిపోయింది. దీంతో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థినులకు వసతి నిలిపివేశారు. దీంతో అప్పటి నుంచి విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటున్నారు. బాలిక విద్య గురించి గొప్పగా చెప్పే అధికారులు, ప్రజా ప్రతి నిధు లు హాస్టల్‌ను ప్రారంభించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌కు వెళ్లాను
కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు వెళ్లాను. ఆగస్టు 2న హాస్టల్‌ను ప్రారంభిస్తామని చెప్పింది వాస్తవమే. విద్యార్థులు తక్కువగా నమోదు కావడం వలన ప్రారంభించలేకపోయాం. త్వరలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించ హాస్టల్‌ను ప్రారంభిస్తాం.
– శంకర్, ప్రిన్సిపాల్