మోత్కూరు
సామాజిక తెలంగాణ సాధనకు బడుగు, బలహీనవర్గాలు పోరాడాలని తెలంగాణ ఉద్యమ వేదిక జిల్లా అధ్యక్షుడు యానాల లింగారెడ్డి కోరారు. సోమవారం మండలకేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఐక్య వేదిక మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మైండ్ గేమ్‌తో ప్రజలను పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ వేదిక మండల అడ్‌హాక్ కమిటీ కన్వీనర్‌గా ధర్మారం గ్రామానికి చెందిన మందుల నర్సింహను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఉద్యమ వేదిక నియోజకవర్గ అధ్యక్షుడు గఫర్‌ఖాన్, కార్యదర్శి జి.రమేష్‌గౌడ్, తెలంగాణ ఉద్యమ స్టూడెంట్ వేధిక జిల్లా అధ్యక్షుడు నార్కట్‌పల్లి రమేష్ నాయకులు తొంట పాండు, బాలెంల పరుశరాములు, సందీప్, విజయచంద్ తదితరులు ఉన్నారు.
సామాజిక తెలంగాణ సాధనకు పోరాడాలి
Published Tue, Aug 30 2016 1:02 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement
Advertisement