ఏ ప్రతిభ ఆధారంగా బదిలీలు చేస్తున్నారు
► ప్రభుత్వానికి ఎస్టీయూ సూటిప్రశ్న
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ విడుదల చేయకుండా రాజకీయ బదిలీలు చేపడుతున్న ప్రభుత్వం ఏ ప్రతిభ ఆధారంగా చేస్తున్నారో వెల్ల్లడించాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉద్దండం జయరామయ్య డియాండ్ చేశారు. నగరంలోని ఎస్టీయూభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రతిభ ఆధారిత బదిలీలు తప్పనిసరి అని చెబు తూనే మరోవైపు ప్రభుత్వం అవలం బిస్తున్న వైఖరి దేనికి సంకేతం అని ప్రశ్నించారు.
పట్టణ ప్రాంతాల్లో పరస్పర బదిలీల ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించపోతే త్వరలో ఎస్టీయూ తరఫు న ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు రఘునాథ రెడ్డి, ఇలియాస్‌బాషా మాట్లాడుతూ ఆరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.