విద్యార్థుల వెంటే కాంగ్రెస్
‘‘ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రాబట్టుకొనే వరకు విద్యార్థుల వెంటే కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ ఉంటాయని పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కుంతియా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆల్ ఇండియా చైర్మన్ కొప్పుల రాజులు మూకుమ్మడిగా పేర్కొన్నారు. ఆర్మూరులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ విద్యార్థి యువ గర్జనకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 200 మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు.
-ఆర్మూరు