పేరుకుపోయిన బకాయిలు | Accumulated arrears | Sakshi
Sakshi News home page

పేరుకుపోయిన బకాయిలు

Published Thu, Jan 8 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

పేరుకుపోయిన బకాయిలు

పేరుకుపోయిన బకాయిలు

విద్యార్థుల సంఖ్య 1,02,357
పెండింగ్ డబ్బులు రూ.100 కోట్లు

 
నక్కలగుట్ట : ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు పేరుకుపోయూరుు. 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లాకు సంబంధించి సుమారు రూ.100 కోట్లు పెండింగ్‌లో ఉన్నారుు. జిల్లావ్యాప్తంగా 642 కళాశాలలకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్  కింద సర్కారు చెల్లించాల్సిన ట్యూషన్ ఫీజులు, విద్యార్థులకు అందజేయూల్సిన ఉపకార వేతనాలు నిలిచిపోయూరుు. ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎం కిరణ్ హయూం నుంచి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ చెల్లింపులో జాప్యం జరుగుతూ వస్తోంది. అప్పటి సీఎం పట్టించుకోకపోవడం.. తెలంగాణ ఉద్యమం.. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలతో ఫీజుల చెల్లింపులో ఆలస్యమైంది. 2014 జూన్‌లో నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం.. కొత్తగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడంతో తెలంగాణ విద్యార్థులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఏడు నెలలు గడిచినా జాప్యం జరుగుతూనే ఉంది. కంటి తుడుపు చర్యగా 25 శాతం ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకాయిలను రెండు నెలల క్రితం చెల్లించి న ప్రస్తుత ప్రభుత్వం.. ఆ తర్వాత ముఖం చాటేసింది. నెలరోజుల్లోనే పూర్తి బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హమీ కాగితాలకే పరిమితం కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు కాలేజీ యూజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో జిల్లాలోని వివిధ విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టగా.. ఫీజు పోరు ఉధృత రూపం దాల్చింది.
 
బీసీ సంక్షేమ శాఖ పరిధిలో..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు అన్నీ కలిపి 642 ఉండగా.. 2013-14కు సంబంధించి 1,02, 357 మంది విద్యార్థులు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇం దులో 49,410 మంది ఫ్రెష్ (కొత్త)గా దరఖాస్తు చేసుకోగా, 60,830 మంది రెన్యూవల్ చేసుకున్నా రు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కళాశాలల్లో ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద ఇప్పటివరకు రూ.72.42 కోట్లు, ఉపకార వేతనాల కింద రూ. 27.95 కోట్లు విడుదలయ్యూరుు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కలిపి ఇంకా మొ త్తం రూ.51.99 కోట్లు విడుదల కావాల్సి ఉంది. స్కాలర్ షిప్‌ల కింద రూ. 11.33 కోట్లు పెండింగ్‌లో ఉండగా.. మిగతావి ఫీజురీరుుంబర్స్‌మెంట్ బకారుులు. జిల్లాలోని 281 కాలేజిల్లో 8,660 మంది ఈబీసీ విద్యార్థులు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు వచ్చారుు. ఇందులో 3,177 మంది విద్యార్థులు ఫ్రెష్‌గా దరఖాస్తు చేసుకోగా, 5,483 మంది రెన్యూవల్ చేసుకున్నారు. ఇప్పటివరకు స్కా లర్ షిప్‌ల కింద రూ.80.80 కోట్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద రూ.14.30 కోట్లు విడుదలయ్యూరుు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు ఇంకా రూ.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నారుు. బీసీ, ఈబీసీలకు సంబంధించి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ రూ.59 కోట్లు పెండింగ్‌లోఉన్నట్లు రికార్డులు చెబుతున్నారుు.

ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో..

దళిత సంక్షేమ శాఖ పరిధిలో 2013-14కు సంబంధించి 16,337 మంది విద్యార్థులు ఫ్రెష్‌గా, 35,495 మంది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇ ప్పటివరకు స్కాలర్‌షిప్‌ల కింద రూ.13.16 కోట్లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద రూ.25,32 కోట్లు చె ల్లించారు. ఇంకా జిల్లాలోని ఎస్సీ విద్యార్థులకు సంబంధించి కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రీరుుం బర్స్‌మెంట్  రూ.14 కోట్లు పెండింగ్‌లో ఉన్నారుు.
 
గిరిజన సంక్షేమ శాఖలో..
 
2013-14కు సంబంధించి 10,858 మంది విద్యార్థులు ఫ్రెష్‌గా, 12,144 మంది రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద రూ.10.73 కోట్లు, ఉపకార వేతనా లు రూ.4.76 కోట్లు విడుదలయ్యూరుు. ఇంకా.. రీరుుంబర్స్‌మెంట్ నిధులు రూ.25.51 కోట్లు, స్కాలర్‌షిప్‌లు రూ. 12.7 కోట్లు పెండింగ్‌లో ఉన్నారుు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement