చేబ్రోలులోని హరేరామగుడి సమీపంలోని మెరకల ప్రాంతంలో విద్యార్థిని సూరిశెట్టి విజయకల్యాణిని లారీ ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలపాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కల్యాణి పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. సైకిల్‌ను, విద్యార్థినిని లారీ 20 అడుగుల మేర ఈడ్చుకుపోయింది.
లారీ ఢీకొని విద్యార్థిని మృతి
Oct 14 2016 9:54 PM | Updated on Apr 3 2019 7:53 PM
గొల్లప్రోలు :
చేబ్రోలులోని హరేరామగుడి సమీపంలోని మెరకల ప్రాంతంలో విద్యార్థిని సూరిశెట్టి విజయకల్యాణిని లారీ ఢీకొనడంతో ఆమెకు తీవ్ర గాయాలపాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్థానిక జెడ్పీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న కల్యాణి పాఠశాల నుంచి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. సైకిల్‌ను, విద్యార్థినిని లారీ 20 అడుగుల మేర ఈడ్చుకుపోయింది. దీంతో విద్యార్థినికి తీవ్రగాయాలు కావడంతో పాటు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. 108పై విద్యార్థినిని చికిత్స నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. ఆక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement