విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ
ఇచ్చోడ : ఎంతోమంది విద్యార్ధుల ఆత్మబలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాగే రంజిత్‌కుమార్ అన్నారు. ఆదివారం ఇచ్చోడ మండల కేంద్రంలోని సారుుబాబా మందిరంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ప్రభుత్వ ప్రాధన్యతా పథకాలలో లేదనడం ప్రభుత్వనికి సిగ్గు చేటన్నారు. ఫిజు రీరుుంబర్స్‌మెంట్ లేకపోవడంతో ఎంతోమంది విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడిందని ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. వెంటనే ఫీజు రీరుుంబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు కావస్తున్న ఇప్పటికీ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నభోజన పథకాన్ని ప్రాంభించలేదని ఆరోపించారు.
వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ చేయక పోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెండు జిల్లాల సంఘటన కార్యదర్శులు నంది మల్ల రాజేశ్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ మనోప్‌పవార్, కొకన్వీనర్ వెంకటేశ్, ఇచ్చోడ , నిర్మల్ , ఖానపూర్ బాగ్ కన్వీనరులు రాజేశ్వర్, ప్రమోద్, బాపురావు , ఆదిలాబాద్, నిర్మల్ నగర కార్యదర్శులు ప్రశాంత్, కూమార్ కార్యకర్తలుపాల్గోన్నారు.