ఒకే రోజు 10 వేల మొక్కలు నాటిన విద్యార్థులు
సంగారెడ్డి మున్సిపాలిటీ :రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ హరితహరం కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల అవరణలో హాస్టల్ విద్యార్థులు ఒకే రోజు 10 వేల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్‌చార్జి కమిషనర్, ఎజేసీ, వాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం 10 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ఇప్పటికే పట్టణంలో 40 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా తాము 90 వేల మొక్కలు నాటామన్నారు.
అగస్టు 15 నాటికి పట్టణంలోని మున్సిపల్ పార్కులు, స్కూల్ గ్రౌండ్లతో పాటు శ్మశానవాటిక స్థలాలతో పాటు పంచాయతీరాజ్, ఆర్‌ండ్‌బీ మున్సిపల్ రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటుతామన్నారు. మున్సిపల్ చెర్‌పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ హరిత తెలంగాణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా భావించకుండా సేవా కార్యక్రమంగా చూసి ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కార్యక్రంలో డిప్యూటీ ఇంజినీర్ ధర్మారెడ్డి, ఏఈ మహేష్, వార్డు కౌన్సిలర్ యాకుబ్‌అలీతో పాటు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.