‘ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి’
Published Wed, Jul 27 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
చెన్నూర్ : విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యను అభ్యసించాలని, దాతలు ఇచ్చిన ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని స్టేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ టి.శ్రీనివాసాచార్య అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆ పాఠశాల విద్యార్థులతో పాటు ఉర్దూ బాలికల పాఠశాలల విద్యార్థులకు కుట్టు మిషన్, వాటర్ ఫిల్టర్, టేబుల్ ఫ్యాన్, స్కూల్ బ్యాగులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజీఎం వెంకటరమణ ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ విద్య స్కీంలో భాగంగా మూడేళ్ల నుంచి విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీర్ల మల్లారెడ్డి, ఉపాధ్యాయులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement