విజయవాడ: కాపుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సబ్ కమిటీని నియమించింది. బుధవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఆరుగురు మంత్రులతో కూడిన కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ సబ్ కమిటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, నారాయణ, కేఈ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు సభ్యులుగా ఉంటారు. మరోవైపు వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు వెయ్యి కోట్లు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. సబ్ కమిటీ అందరితో మాట్లాడతారని చంద్రబాబు తెలిపారు.