sub committee
-
TS: ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రజా పాలన దరఖాస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కేబినెట్ సబ్‌కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టిని నియమించారు. కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియమించారు. తెలంగాణ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తులపై రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, అన్ని శాఖల ఉన్నతాధికారులు, ప్రజా పాలన నోడల్ అధికారులు హాజరయ్యారు. డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీకి ఈ నెల చివరి వరకు సమయం కావాలని అధికారులు కోరారు. కోటి అయిదు లక్షల దరఖాస్తు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా పాలన-అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరిగిందని, సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలనలో కోటి అయిదు లక్షల అభయహస్తం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఇతర రేషన్ కార్డు, భూములు తదిరల అంశాల నుంచి 20 లక్షలు వచ్చాయన్నారు. డేటా ఎంట్రీ తరువాత కేబినెట్, అలాగే సబ్ కమిటీలో చర్చలు జరిపి విధివిధానాలు అర్హులను ప్రకటిస్తామన్నారు. అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి అమలు చేస్తామని చెప్పారు. ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందన్నారు. కారు కూతలు కూస్తే ఊరుకోం ఈ నెల 25వ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్లైన్లో పొందుపరుస్తామని మంత్రి చెప్పారు. ధరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ లింక్ చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేతలు 40 రోజుల్లో హామీలు అమలు చేయడం లేదని అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 40 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని తామెక్కడ చెప్పలేదని, వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పామని అన్నారు. ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఎవరెన్నీ విమర్శలు చేసినా, మేం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. వంద రోజుల్లో ఇచ్చిన మాట అమలు చేస్తామని తెలిపారు. -
తుంగభద్రపై ఐదు టెలిమెట్రీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆయకట్టుకు రావాల్సిన జలాలకు మార్గంమధ్యలోనే గండి పడుతోంది. 19.5 టీఎంసీలు రావాల్సి ఉండగా, ఏటా 5 టీఎంసీలకు మించి రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ కాల్వకు వస్తున్న జలాలను శాస్త్రీయ పద్ధతిలో లెక్కించడానికి ఐదు చోట్లలో టెలీమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సబ్ కమిటీ వచి్చంది. కృష్ణా బోర్డు సభ్యుడు రవికుమార్ పిళ్లై మెంబర్ కన్వీనర్‌గా, ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కో ఇంజనీర్ సభ్యులుగా ఉన్న బోర్డు సబ్ కమిటీ ఇటీవల సుంకేశుల, ఆర్డీఎస్, జూరాల ప్రాజెక్టులను సందర్శించింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర జలాశయం నుంచి ఆర్డీఎస్ కాల్వకు నీళ్లు విడుదల చేసే రెగ్యులేటర్ వద్ద, కర్ణాటకలో 43 కి.మీ ప్రయాణించి తెలంగాణ సరిహద్దులకు ఆర్డీఎస్ కాల్వ చేరుకునే పాయింట్ వద్ద, తుమ్మిళ్ల ఎత్తిపోతల దగ్గర, సుంకేశుల జలాశయంతో పాటు ఈ జలాశయం నుంచి కేసీ కాల్వకు నీటి సరఫరా చేసే రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీ సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా సూచిస్తూ సబ్ కమిటీ త్వరలో కృష్ణా బోర్డుకు నివేదిక సమర్పించనుంది. దీంతో తుంగభద్ర డ్యాం నుంచి ఎన్ని నీళ్లు ఆర్డీఎస్ కాల్వకు విడుదల చేస్తున్నారు? అందులో ఎన్ని నీళ్లు రాష్ట్ర సరిహద్దులకు చేరుతున్నాయి? తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా తుంగభద్ర నది నుంచి ఏ మేరకు నీళ్లను ఆర్డీఎస్ కాల్వకు మళ్లిస్తున్నారు? సుంకేశుల జలాశయానికి ఎన్ని నీళ్లు వస్తున్నాయి ? సుంకేశుల నుంచి ఏ మేరకు నీటిని కేసీ కాల్వకు తరలిస్తున్నారు ? అన్న విషయాలపై స్పష్టత రానుంది. త్వరలో జరగనున్న తుంగభద్ర బోర్డు సమావేశంలో ఈ సబ్ కమిటీ సిఫారసుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
ఫీజుకూ ఓ హద్దు.. మీరితే గుర్తింపు రద్దు!
తెలంగాణవ్యాప్తంగా 11వేల ప్రైవేటు స్కూళ్లలో 35 లక్షలకుపైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ స్కూళ్లలో ఫీజులు ఇష్టారాజ్యంగా ఉంటున్నాయని, ఎప్పటికప్పుడు భరించలేని విధంగా పెంచుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు ఎన్ని జీవోలు తెచ్చినా అవి న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరమే ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. స్కూలును బట్టి రూ.12 వేల నుంచి రూ.4 లక్షల వరకూ వార్షిక ఫీజును ప్రైవేటు విద్యాసంస్థలు వసూలు చేస్తున్నాయి. కొన్ని స్కూళ్లు ఏటా ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచుతున్నట్టు ప్రభుత్వం దృష్టికొచ్చింది. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఓ కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు ఏకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై అధ్యయనానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని పేద, మధ్య తరగతి వర్గాలు స్వాగతిస్తున్నాయి. వీలైనంత త్వరగా పటిష్టమైన నియంత్రణాధికారంతో చట్టం తేవాలని మేధావులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. వాస్తవానికి పేదవర్గాలను ఫీజుల పేరుతో పీల్చి పిప్పి చేసే వ్యవస్థలపై 2016లోనే ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఫీజుల నియంత్రణపై అధ్యయనానికి ఆచార్య తిరుపతిరావు కమిటీని వేసింది. ఈ కమిటీ 2017లో ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు కూడా చేసింది. ఇప్పుడు ఆ సిఫారసులను కూడా పరిగణనలోనికి తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రత్యేక చట్టాలు ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. మొత్తం 11 వేల ప్రై వేటు స్కూళ్ళను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావిస్తోంది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చే యోచనలో ఉంది. ఆచార్య తిరుపతిరావు సిఫారసులేంటి? ప్రభుత్వం నియమించిన తిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల మనోభీష్టాన్ని తెలుసుకుంది. కాగా బడ్జెట్ స్కూళ్ళు (వార్షిక ఫీజు రూ. 20 వేల లోపు ఉండేవి) ఫీజుల నియంత్రణను స్వాగతించాయి. ♦స్కూల్ డెవలప్మెంట్ (అభివృద్ధి) చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి 15 శాతం ఏటా పెంచుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవోలిచ్చారు. ఇదే సమస్యగా మారింది. పెద్ద స్కూళ్ళు అవసరం లేని ఖర్చును అభివృద్ధిగా చూపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక స్కూల్లో ప్రతి గదిలో అత్యాధునిక సౌండ్ సిస్టం, టెక్నాలజీ అభివృద్ధి చేశారు. దీన్ని విద్యార్థుల కోసం ఖర్చు పెట్టినట్టు లెక్కల్లో చూపారు. తర్వాత ఫీజులు 25 శాతం పెంచారు. ♦స్కూళ్ళ మూడేళ్ళ ఖర్చును బట్టి వార్షిక ఫీజుల పెంపునకు అనుమతించాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 11 వేల స్కూళ్ళ ఆదాయ, వ్యయ లెక్కలు చూడాలంటే ప్రత్యేక యంత్రాంగం ఉండాలి. దీన్ని దృష్టిలో ఉంచు కుని కొన్ని సిఫారసులు తెరమీదకొచ్చాయి. ♦ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా ఉండాలని ప్రతిపాదించారు. వేతనాలు, స్కూలు కోసం కొనుగోలు చేసే మౌలిక వసతులు, ఇతరత్రా ఖర్చులన్నీ బ్యాంకు ద్వారానే చెల్లించాలి. విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. ఎక్కడ తప్పు చేసినా భారీ జరిమానా, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దును కమిటీ సిఫారసు చేసింది. ♦ఈ విధానం అమలుచేస్తే చాలా స్కూళ్ళు 10 శాతానికి లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతిరావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్‌లైన్‌ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతం లోపు ఫీజులు పెంచేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం అమల్లోకి రాలేదు. తాజాగా ఈ ప్రతిపాదనలే మంత్రివర్గ ఉప సంఘం పరిశీలిస్తున్నట్టు సమాచారం. చట్టం అమల్లో చిత్తశుద్ధి అవసరం ఫీజుల నియంత్రణ పేదవాడికి ఊరటనిస్తుంది. దీనికోసం చట్టం తేవడానికే మంత్రివర్గ ఉప సంఘం వేశారంటే స్వాగతించాల్సిందే. అయితే చట్టం తెస్తే సరిపోదు. చట్టం అమలులో చిత్తశుద్ధి అవసరం. అన్ని వర్గాల మనోభావాలకు అనుగుణంగా ఫీజులను నియంత్రించేలా చట్టం ఉండాలి. నియంత్రణలో తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి. – వెంకటసాయినాథ్ కడప, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రై వేటు స్కూళ్ల నిర్వాహకులను చేర్చాలి ప్రభుత్వం నిర్వహించే మోడ ల్, జెడ్పీ స్కూల్స్ మధ్యే నిర్వహ ణ ఖర్చులో తేడా ఉంటుంది. అదే విధంగా ప్రైవేటు బడుల్లోనూ ఆదాయ వ్యయాల్లో తేడా ఉంటుంది.దీన్ని పరిగణనలోనికి తీసుకుని ఫీజులపై నియంత్రణ ఉండాలి. రూ.20 వేల కన్నా తక్కువ ఫీజులున్న స్కూళ్ళను ఈ చట్టం పరిధిలోకి తెస్తే ఉపయోగం ఉండదు. చట్టంలో ప్రై వేటు స్కూళ్ళ యాజమాన్యాల భాగస్వామ్యం ఉండేలా చూడాలి. – యాదగిరి శేఖర్‌రావు, గుర్తింపు పొందిన ప్రైవేటు స్కూళ్ల (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు చట్టంతోనే ఫీజులకు అదుపు పిల్లల టెన్త్ పూర్తయ్యే సరికి ప్రై వేటు స్కూళ్ళ ఫీజుల కోసం స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. స్కూల్లో కొత్తగా ఏమీ పెట్టకపోయినా ఏటా ఫీజులు పెంచుతున్నారు. అడ్డగోలు ఫీజులపై అధికారులకు చెప్పినా ప్రయోజనం ఉండటం లేదు. చట్టం తీసుకొస్తేనే పేదవాడికి ఉపశమనంగా ఉంటుంది. – వి. సూర్యప్రకాశ్‌రావు, విద్యార్థి తండ్రి, ముత్తారం, ఖమ్మం జిల్లా పటిష్టమైన చట్టం అవసరమే అన్ని వర్గాల అభిప్రాయాల మేరకు ప్రభుత్వానికి అవసరమైన సిఫారసులు చేశాం. వీటిని అమలు చేసే దిశగా.. అవసరమైన చట్టం తేవాలనే దృఢ చిత్తంతో ప్రభుత్వం ముందుకెళ్ళడం హర్షణీయం. ఈ చట్టం ఏ విధమైన సమస్యలకు తావు లేకుండా, ఫీజుల నియంత్రణలో ప్రభుత్వ యంత్రాంగానికి ఉపయోగ పడేలా ఉంటుందని ఆశిస్తున్నా. – ఆచార్య తిరుపతిరావు, ప్రభుత్వ కమిటీ చైర్మన్ -
చేతులెత్తేసిన సబ్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల స్వాధీనం, వాటి ఆపరేషన్, ప్రొటోకాల్ అంశాలపై అధ్యయనం చేసేందుకు రంగంలోకి దిగిన కృష్ణా బోర్డు సబ్ కమిటీ దీనిపై ప్రాథమిక దశలోనే చేతులెత్తేసింది. కేంద్ర జల సంఘం ఇంజనీర్లతో కలిసి తయారు చేసిన ముసాయిదా నివేదికపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తిన నేపథ్యంలో దానిపై వెనక్కి తగ్గింది. దీంతో పూర్తిస్థాయి బోర్డు భేటీలోనే ఈ అంశాన్ని తేల్చుదామంటూ కృష్ణా బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖల ద్వారా సమాచారమిచ్చింది. కృష్ణా స్పెషల్ బోర్డు భేటీలో చేసిన నిర్ణ యం మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, సభ్యుడు రవికుమార్ పిళ్లైల నేతృత్వం లో సబ్ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీ ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్‌పై అధ్యయనం చేసేందుకు గత నెల 25, 26 తేదీల్లో శ్రీశైలం పరిధిలో పర్యటించింది. అనంతరం ఒక ముసాయిదా నివేదికను రూపొందించి రాష్ట్రాల పరిశీలనకు అందజేసింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల కనీస నీటి మట్టం వరకు విద్యుత్ అవసరాలకు నీటిని వినియోగించుకోవచ్చని, 854 అడుగుల మట్టంలో నీరున్నప్పుడు తాగు, సాగు అవసరాలకు నీటిని వినియోగించుకోచ్చని పేర్కొంది. బచావత్ అవార్డుకు విరుద్ధం: తెలంగాణ ఈ ముసాయిదాపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రాజెక్టుల స్వాధీనం, నిర్వహణకు సంబంధించి కమిటీ మార్గదర్శకాలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కృష్ణా నీటి పంపిణీ, వినియోగంపై నిర్దిష్టమైన విధానాన్ని బచావత్ పేర్కొన్న నేపథ్యంలో ఆ విధానాన్నే అమ లుచేయాలని డిమాండ్ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అని పేర్కొన్నారని, కరెంట్ ఉత్పత్తి మినహా శ్రీశైలం నుంచి మరో ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ఆస్కారమే లేదని ఇటీవల లేఖలో స్పష్టం చేసింది. బోర్డుకు గానీ, కేంద్రానికి గాని బచావత్ అవార్డులో ని నిబంధనలను పునర్నిర్వచించే అధికారం లేదని తేల్చిచెప్పింది. దీంతో సబ్ కమిటీ వెనక్కి తగ్గింది. ఆయా అంశాలపై పూర్తిస్థాయి బోర్డు భేటీలో చర్చ జరగాలని, అక్కడి అభిప్రాయం మేరకే నడుచుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ మేరకు బోర్డుతెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసినట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. -
హెల్త్ క్యాలెండర్‌కు సబ్ కమిటీ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన ‘హెల్త్ క్యాలెండర్’కు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం 24 అంశాలతో, 71 పేజీల్లో రూపొందించిన ఈ క్యాలెండర్‌ను త్వరలో అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జనవరి మొదలుకొని డిసెంబర్ వరకూ ఏ నెలలో ఏ వ్యాధులకు అవకాశం ఉంది? దాని లక్షణాలు, ముందస్తు జాగ్రత్తలు వంటి పలు వివరాలతో ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. నిర్మాణం జరిగి ఉపయోగంలో లేకుండా ఉన్న 1,500 పడకలను వెంటనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వెయ్యి ఫాగింగ్ మిషన్లతో రాష్ట్రవ్యాప్తంగా దోమల నివారణకు స్ప్రే చేయించాలని సమావేశంలో నిర్ణయించారు. దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈటల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
30 అంశాలపై అధ్యయనం చేయనున్న కేబినెట్ సబ్‌కమిటీ
-
జగన్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పాలసీలు, ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఐదుగురు మంత్రులు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నీటిపారుదల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డితోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్సింగ్ ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్ణయాలు, పాలసీలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటైన సంస్థలపై ఈ కమిటీ సమీక్ష చేయనుంది. దాదాపు 30 అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాలనలో పారదర్శకత, అవినీతి రహిత పాలన, ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేసేదిశగా ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించి గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, అవకతవకలు, అవినీతిపై లోతుగా అధ్యయనం చేయనుంది. సమీక్ష అనంతరం నివేదికతోపాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపైనా కమిటీ సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇవ్వనుంది. ఆరువారాల్లో సమీక్ష పూర్తి చేసి..నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ కమిటీ ఏర్పాటుతో పరిపాలనపరంగా మరో కీలక ముందడుగువేసినట్టు భావిస్తున్నారు. -
'ఆ ఆరుగురు అందరితో మాట్లాడతారు'
విజయవాడ: బీసీలకు అన్యాయం జరగకుండా సమస్యను పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బుధవారం ఆయన విజయవాడ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపుల సమస్యను పరిష్కరించేందుకు ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే 'నిన్న కాపు నేతలందరితో మాట్లాడా. మేం తొందరపడటం లేదని వారందరు అన్నారు. మీరు కమిషన్ వేసి తొందరగా న్యాయం చేయండి అన్నారు. డబ్బులు కేటాయిస్తామన్నారు... అవి పూర్తిగా చేయండి అన్నారు. నిన్న వాళ్లతో ఏమైతే చెప్పానో అదే విధంగా వెయ్యికోట్లు కేటాయిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి ఆరుగురు మంత్రులతో కమిటీ వేశాం. ఆ ఆరుగురు అందరితో మాట్లాడతారు. బీసీలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం. కొంతమంది బీసీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బీసీ నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వడం మంచి పద్ధతి కాదు. రూ.6,600 కోట్లు పెట్టి బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చామని' చెప్పారు. కేబినేట్ నిర్ణయాలు ► త్వరలో నూతన గృహ నిర్మాణ విధానం ► కేంద్రం లక్షా 93 వేల ఇళ్లు, రాష్ట్రం రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తుంది ► 10 వేల ఎకరాల్లో ఈ టౌన్ షిప్ ల నిర్మాణం ► శాంతిభద్రతల కోసం డ్రోన్ వంటి ఎలక్ట్రానిక్ డివైస్ లను వినియోగిస్తాం ► పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ► జూన్ నాటికి అన్ని జిల్లాల్లో ఫైబర్ గ్రిడ్ పనులు ► గ్రామగ్రామానికి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తాం ► వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం ► రెగ్యూలర్ వ్యవసాయమే కాకుండా ఆర్గానిక్, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం ► ఈ ఏడాది 5 వేల కిలో మీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం ► ఈ ఏడాది 7 నుంచి 8 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తాం. -
కాపుల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ
విజయవాడ: కాపుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ సబ్ కమిటీని నియమించింది. బుధవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో ఆరుగురు మంత్రులతో కూడిన కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, నారాయణ, కేఈ కృష్ణమూర్తి, కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు సభ్యులుగా ఉంటారు. మరోవైపు వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. సబ్ కమిటీ అందరితో మాట్లాడతారని చంద్రబాబు తెలిపారు. -
గోదావరి పుష్కరాల పనులకు ఉపసంఘం ఏర్పాటు
హైదరాబాద్: గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహకాలు చేస్తోంది. గోదావరి పుష్కరాల పనుల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రులు యనమల రామకృష్టుడు, మాణిక్యాలరావు, పి.నారాయణలు సభ్యులుగా ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. -
అన్నదాతలకు అవమానం
గుంటూరు సిటీ : రాజధాని ప్రతిపాదిత గ్రామాల రైతులను ప్రభుత్వం అవమానిస్తోంది. వారి కాలాన్ని వృథా చేస్తూ రైతులంటే లెక్కలేనట్టు వ్యవహరిస్తోంది. భూసేకరణ విషయమై మాట్లాడేందుకు రావాలని ఆహ్వానించి గంటల తరబడి నిలబెట్టింది. ఠంచనుగా వచ్చినా పట్టించుకున్నవారే లేకపోవడంతో రైతులంతా చెట్లకింద నిరీక్షించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వబోమని నిరాకరిస్తున్న రైతులతో మాట్లాడాలని భూ సేకరణ సబ్ కమిటీ నిర్ణయించింది. తొలుత గురువారం విజయవాడలో సమావేశమని రైతులకు కబురు చేశారు. ఆ తరువాత అక్కడ కాదు గుంటూరు రావాలని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దకు రావాలని కచ్చితంగా చెప్పారు. భూ సేకరణ సబ్ కమిటీ సూచనల మేరకు రాజధాని ప్రతిపాదిత గ్రామాల నుంచి భూములు ఇవ్వబోమంటున్న రైతులు ఠంచనుగా సాయంత్రం ఐదుగంటలకు గుంటూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. అప్పటికి భూ సేకరణ సబ్ కమిటీ సభ్యులు రాలేదు. సమయం ఐదు కాస్తా ఏడయింది..అన్నదాతల్లో అసహనం మొదలైంది. ఏం చేయాలో తోచక అతిథి గృహం ఆవరణలో తచ్చట్లు మొదలెట్టారు. రాత్రి ఎనిమిద య్యింది. ఇప్పటివరకు వేచి ఉండి, ఇక వెనుదిరగడం దేనికని రైతులంతా అక్కడే ఉన్నారు. రాత్రి ఎనిమిది గంటల తరువాత తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాత్రం తాపీగా అతిథిగృహం చేరుకున్నారు. ఆ తరువాత మంత్రి రావెల కిషోర్‌బాబు వచ్చారు. అయినా సమావేశం ప్రారంభం కాలేదు. మూడు గంటలకు పైగా వేచి ఉన్న రైతుల్లో ఒక్కసారిగా అసహనం చెలరేగింది. ఇంకా ఎంత సేపు ఎదురు చూడాలంటూ అతిథి గృహం నుంచి బయటకు బయలుదేరారు. దీంతో ఇటు శ్రావణ్‌కుమార్, అటు రావెల వారిని సముదాయించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు. ఒక దశలో రైతులు రావెల కిషోర్‌బాబుపై విరుచుకుపడ్డారు. భంగపాటుతో ఆయన లోపలకు వెళ్లిపోగా, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ వారికి సర్దిచెప్పి శాంతింపజేశారు. -
తెలంగాణ రోడ్ల అభివృద్ధికి సబ్ కమిటీ ఏర్పాటు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటి సీఎం టి.రాజయ్యను నియమించారు. ఈ సబ్ కమిటీలో మరో ఎనిమిది మంది మంత్రులను సభ్యులుగా నియమించారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధిపై అధ్యయనం చేసి.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. -
నిజాం షుగర్ ఫ్యాక్టరీలను టేకోవర్ చేయాలని నిర్ణయం
నిజామాబాద్: నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం టేకోవర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని బోధన్, మెట్పల్లి, మిమ్మెజిపల్లిలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం టేకోవర్ చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. దానికి సంబంధించిన నివేదికను క్యాబినెట్ కు పంపుతామని మంత్రులు సునీత, సుదర్శన్ రెడ్డిలు తెలిపారు. ఆ ఫ్యాక్టరీలను నడుపుతున్న వ్యక్తులను పిలిచి మాట్లాడామని వారు పేర్కొన్నారు. దానికి గాను రూ.234 కోట్లు ఇవ్వాలని అధికారులు చెప్పారని మంత్రులు స్ఫష్టం చేశారు.